మాజీ ప్రియుడితో తమాషా…!

0

Deepika_padukone (14)నిజజీవితంలో విఫలప్రేమికులైన రణభీర్‌కపూర్-దీపికాపదుకునే జంట వెండితెరపై మాత్రం సక్సెస్‌ఫుల్ జోడీగా పేరుతెచ్చుకుంటున్నారు. వీరిద్దరు కలిసి నటించిన యే జవానీ హై దివానీ చిత్రం గత ఏడాది బాలీవుడ్‌లో సంచలనం సష్టించింది. వసూళ్లపరంగా అగ్ర చిత్రాల జాబితాలో నిలిచింది. దీంతో ఈ జంటకు బాలీవుడ్‌లో డిమాండ్ బాగా పెరిగింది. ఇదిలావుండగా వీరిద్దరు కలిసి మరో చిత్రంలో నటించబోతున్నారు.

ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించే తమాషా చిత్రంలో రణభీర్, దీపికాపదుకునే నాయకానాయికలుగా ఎంపికయ్యారు. వెండితెరపై తామిద్దరం హిట్‌పెయిర్‌గా గుర్తింపుపొందటం ఆనందంగా వుందని, రణభీర్‌తో కలిసి మరిన్ని సినిమాలు చేయడానికి తాను సిద్ధమని తెలిపింది దీపికా. ప్రేమ విఫలమైనా ప్రస్తుతం తాము విభేదాల్ని మరచిపోయి సినిమాల కోసం శ్రమిస్తున్నామని చెప్పిందామె. సినీరంగంలో ప్రతి అవకాశం విలువైనదే. గతం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో అనుకున్న లక్ష్యాల్ని చేరుకోలేం. సినిమాల్లో రణభీర్‌తో నా కెమిస్ట్రీ బాగుంటుందని అందరూ అంటుంటారు. అందుకే మేము కలిసి నటించిన సినిమాలు పెద్ద విజయాల్ని సాధిస్తున్నాయి. చేదు అనుభవాలన్నింటినీ మరచిపోయి వత్తిపరంగా మేమిద్దరం సంతోషంగా కలిసి పనిచేస్తున్నాం అని పేర్కొంది దీపికాపదుకునే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

"సత్య గ్యాంగ్" సాంగ్స్ సూపర్ అంటున్నారు!!
సాత్విక్ ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాప...
స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
powered by RelatedPosts