మహేష్‌తో పాట మొదలైంది!

0

sruthi hassanచిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడు కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. హీరోయిన్‌గా నటించాల్సిన వాళ్లు ప్రత్యేక గీతాలకే పరిమితమవుతుంటారు. ఇలాంటి సంఘటనే శతిహాసన్ విషయంలో జరిగింది. మహేష్ నటించిన బిజినెస్‌మేన్ చిత్రంలో కథానాయికగా ముందు శతిహాసన్‌ను ఖరారు చేశారు. అయితే అనుకోని కారణావల్ల ఆ సినిమా నుంచి ఆమె తప్పుకోవడంతో ఆ స్థానంలో కాజల్ అగర్వాల్ నటించిన విషయం తెలిసిందే.

ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని వదులుకున్న శతిహాసన్ తాజాగా ఆగడు సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో నటిస్తుండటం విశేషం. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. మహేష్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్ర యూనిట్ ఇటీవలే బళ్లారిలో కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తిచేసుకుని హైదరాబాద్‌కు తిగిగొచ్చింది. ఈ నెల 3 నుంచి మహేష్‌బాబు, శతిహాసన్ పాల్గొనగా ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. తమన్ అద్భుతమైన ట్యూన్‌లు సిద్ధం చేసిన ఈ పాట చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చిత్ర వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మెగాస్టార్ 151 `సైరా న‌ర‌సింహారెడ్డి` లో హేమాహేమీలు
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 151వ సినిమా `సైరా న‌ర‌సింహా రెడ్డి` చిత్రంలో హేమా హేమీలు భాగ‌మ‌య్యారు. బాలీవుడ్ లెజెండ‌రీ అమితాబ...
మెగాస్టార్ 151వ సినిమా `సైరా న‌ర‌సింహారెడ్డి` మోష‌న్ పోస్ట‌ర్ నా చేతుల మీదుగా లాంచ్ చేయ‌డం అదృష్టంగానూ..గౌర‌వంగాను భావిస్తున్నాను: ద‌ర్శ‌క ధీర‌డు రాజ‌మౌళి
మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చిరంజీవి 151వ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. మంగళవారం ఆయన పుట్టినరోజు స...
powered by RelatedPosts