మహాశివరాత్రి కానుకగా ‘సతీ తిమ్మమాంబ’ విడుదల

0
 ST copy
మహాశివరాత్రి కానుకగా ‘సతీ తిమ్మమాంబ’ విడుదల
ఎస్‌.ఎస్‌.ఎస్‌. ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో భవ్యశ్రీ ప్రధాన పాత్రలో నిర్మాత పెద్దరాసు సుబ్రమణ్యం నిర్మించిన హిస్టారికల్‌ మూవీ ‘సతీ తిమ్మమాంబ’. భారీ గ్రాఫిక్స్‌తో ముస్తాబైన ఈ మూవీని మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బాలగొండ ఆంజనేయులు మాట్లాడుతూ..’అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో ఏడెకరాల భూమిలో ఎంతో విశిష్టత కలిగిన తిమ్మమ్మ మర్రిమాను చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్ర నిర్మాణం కోసం నిర్మాత పెద్దరాసు సుబ్రమణ్యంగారు అందించిన సహకారం మరిచిపోలేను. అలాగే ఆర్టిస్ట్‌లు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం ఎంతగానో కష్టపడ్డారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము..’ అని అన్నారు.
నిర్మాత పెద్దరాసు సుబ్రమణ్యం మాట్లాడుతూ..”సుమారు 600 వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తిమ్మమ్మ మర్రిమాను చరిత్రను చలనచిత్రంగా తెరకెక్కించినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో ఈ మర్రిమాను చోటు సంపాదించుకుంది అంటే..ఈ మానుకు ఎటువంటి చరిత్ర ఉందో తెలుసుకోవచ్చు. ఆ చరిత్రను ప్రజలకు తెలియజేయాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. మహాశివరాత్రికి ఈ తిమ్మమాను దగ్గర పెద్ద జాతర జరుగుతుంది. ‘థేరు’ ఉత్సవంగా పేరున్న ఈ జాతరను అనంతపురంకి సంబంధించిన మినిస్టర్స్‌ ప్రారంభిస్తారు. సుమారు మూడు రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. తిమ్మమ్మ అత్తింటి వారు శైవులు. అంటే శివుని ఆరాధించేవారు. రాష్ట్ర నలుమూలల నుండి పాల్గొనే ప్రజల శివనామస్మరణతో ఈ మూడు రోజుల ఉత్సవం ఎంతో విశిష్టతను సంతరించుకుంటుంది. ఈ విశిష్టతను పురస్కరించుకునే..మా ఈ ‘సతీ తిమ్మమాంబ’ చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా..భారీ గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాము. ప్రేక్షకుల్ని, భక్తుల్ని ఈ చిత్రం అలరిస్తుందని ఆశిస్తున్నాము..’ అని అన్నారు.
భవ్యశ్రీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో వెంకట్, వినోద్ కుమార్,  ప్రభాకర్‌, రంగనాధ్‌, చంద్రమోహన్‌, రాజశ్రీ, జూనియర్‌ రేలంగి మొదలగువారు ఇతర తారాగణం.
ఈ చిత్రానికి సంగీతం: బండారు దానయ్యకవి, కెమెరా: షాహిద్‌ హుస్సేన్‌, పాటలు: బండారు దానయ్యకవి, బాలగొండ ఆంజనేయులు, ఎడిటింగ్‌: వినయ్‌, దర్శకత్వ పర్యవేక్షణ: ఎస్‌. రామ్‌కుమార్‌, నిర్మాత: పెద్దరాసు సుబ్రమణ్యం, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బాలగొండ ఆంజనేయులు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
powered by RelatedPosts