మళ్లీ ఇలా కనబడితే జాగ్రత్త!

0

తన చెల్లెలు సోహా అలీఖాన్‌పై సైఫ్ అలీఖాన్ గుర్రుమీద ఉన్నారు. దానికి కారణం ఇటీవల ఆమె చేసిన ఫొటో షూట్. కేవలం లో దుస్తులు మాత్రమే ధరించి, స్విమ్మింగ్ ఫూల్‌లో హాట్ హాట్‌గా సోహా అలీ పోజులిచ్చేశారు. దాంతో ఈ అన్నగారికి కోపం నషాళానికి అంటిందట. ఇంటి పరువు తీసుకెళ్లి స్విమ్మింగ్‌ఫూల్ పాలు చేస్తోందని తల పట్టుకు కూర్చున్నాడట సైఫ్.

అంతటితో ఆగకుండా చెల్లాయమ్మను పిలిచి చీవాట్లు పెట్టాడట. ‘మరోసారి ఇలాంటి ఫొటో షూట్‌లో పోజులిస్తే ఊరుకునేది లేదు… జాగ్రత్త’ అని హెచ్చరికను కూడా జారీ చేశాడట సైఫ్. సోహాకి ఇలాంటి ఫొటో షూట్‌లు కొత్తేం కాదు. గతంలో కూడా ఓ ఇంగ్లిష్ మ్యాగజైన్‌కి హాట్ హాట్‌గా ఫోజులిచ్చి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అప్పుడు కూడా సైఫ్ ఆగ్రహానికి గురయ్యారామె. ఇది రెండో సారి. తన సినిమాల్లో కథానాయికలు ఎంత స్పైసీగా నటించినా ఫర్లేదు కానీ, చెల్లెలు అలా కనిపిస్తే మాత్రం భరించలేకపోతున్నాడు సైఫ్. తన దాకా వస్తే కదా… అసలు బాధ తెలిసేది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts