మరోసారి పోలీసులకి చిక్కిన రచయిత

0

346096536ప్రముఖ సినిమా రచయిత బీవీఎస్ రవి మరోసారి మద్యం తాగుతూ వాహనం నడిపి పోలీసులకు దొరికిపోయాడు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి హైదరాబాద్ పోలీసులు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల కోసం తనిఖీలు నిర్వహించారు. బ్రీత్ ఎనలైజర్లతో అటు నుంచి వెళ్లే వాహన చోదకులు అందరినీ తనిఖీ చేస్తుండగా, అదే సమయానికి అక్కడికి చేరుకున్న సినీ రచయిత బీవీఎస్ రవి వాహనాన్ని పోలీసులు ఆపారు. రవి పక్కన ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా ఉన్నాడు.

వాహనం నడుపుతున్న బీవీఎస్ రవిని పోలీసులు బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా, మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఇంతకుముందు కూడా ఒకసారి ఈయన మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. దాంతో ఇది రెండోసారి అయ్యింది. గతంలో ఆయన పట్టుబడినప్పుడు అదే కారులో సినీ నటుడు రవితేజ, కమెడియన్ శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. వారిని కూడా పోలీసులు తనిఖీలు చేశారు. అయితే వీరు మద్యం సేవించలేదని తేలింది. అనంతరం మరోకారులో రవితేజ, శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి వెళ్లి పోయారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Nela Ticket movie review
Nela Ticket Review: అమ్మ చేతి ముద్దపప్పు ఆవకాయ ఎంత బాగుంటుందో కదా. అమ్మ ప్రతి రొజూ అదే చేసినా ఆనందంగా తింటాం, ఎందుకు అంటే అది ముద్దపప్పు ఆవకాయ ...
‘ఆపరేషన్ 2019’ ట్రైలర్ లాంచ్
“గాంధీ కడుపున గాంధీ పుట్టడు, ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా సరే ప్రజల్లో నుంచే రావాలి వివిధ రూపా...
`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
powered by RelatedPosts