మరోసారి దశరథ్, మనోజ్ కాంబినేషన్

0

downloadఫ్యామిలీ సినిమాల దర్శకుడు దశరథ్, యంగ్ హీరో మనోజ్ కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందనుంది. దాదాపు పదేళ్ల క్రితం వీరి కాంబినేషన్‌లో ‘శ్రీ’ అనే చిత్రం తెరకెక్కింది. ‘సంతోషం, మిస్టర్ పర్‌ఫెక్ట్, వంటి కుటుంబ నేపథ్యంలో సాగే చక్కటి చిత్రాల్ని అందించిన దశరథ్ ‘గ్రీకు వీరుడు’ సినిమా తర్వాత దాదాపు రెండేళ్లు విరామం తీసుకుని సరికొత్త కథను సిద్ధం చేశారట. ఈ కథను విన్న మనోజ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మిస్తారని ఫిలింనగర్ టాక్. అయితే మే20న మనోజ్ వివాహం జరగనుంది. పెళ్లి పనుల్లో బిజీగా ఉండటం వలన వివాహం అనంతరం ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లడానికి దర్శకుడు దశరథ్ సన్నాహాలు చేస్తున్నారు. మాస్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్న మనోజ్ ఈ చిత్రంతో పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంలో నటించబోతున్నాడు. మనోజ్ ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో ‘ఎటాక్’ చిత్రంలో నటిస్తున్నాడు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

powered by RelatedPosts