మరొకరి కష్టానికి మళ్లీ తన పేరేసుకున్నాడు

0

Lovers Success Meet (32)కొత్త దర్శకుడు హరి దర్శకత్వంలో ఇటీవలే విడుదలయి హిట్ టాక్ సొంతం చేసుకుని హౌస్ ఫూల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న “లవర్స్” చిత్రానికి మారుతి నిర్మాతగా వ్యవహరించాడు. అయితే, ఆ చిత్రంలో ఉన్న మిగతా కామెడీ సీన్స్ ఒక ఎత్తు, ఇంటర్వెల్ తర్వాత వచ్చే సప్తగిరి కామెడీ ట్రాక్ మరొక ఎత్తు. సప్తగిరి కామెడీ ట్రాక్ బాగా పేలింది. ఐతే చిత్రంగా, సినిమా విడుదలైన ఇన్ని రోజులకీ, ఆ చిత్ర సమర్పకుడు మారుతి మీడియాతో మాట్లాడుతో బాంబ్ పేల్చాడు. అదేమిటో మారుతి మాటల్లోనే చదవండి.

“ఈ పాయింట్ అనుకున్నప్పుడే సప్తగిరి క్యారెక్టర్ అనుకున్నాను. ఆ తర్వాత ఈ షూటింగ్ జరిగేటప్పుడు ప్రత్యేకంగా నేను వెళ్లి ఆ కామెడీ సీన్స్ ను డైరక్ట్ చేసా. సప్తగరి పిచ్చోడి పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని షూట్ చేసేటప్పుడే అనుకున్నాను. అలాగే దర్శకుడు హరి గురించి మాట్లాడుతూ… “హరి క్లారిటీ ఉన్న దర్శకుడు. ఈ పాయింట్ చెప్పినప్పుడే తనలోని కాన్ఫిడెన్స్ ని గమనించాను. ఇక ఈ సినిమా బాగానే తెరకెక్కించినప్పటికీ సప్తగిరి కామెడీ సీన్స్ మాత్రం నేను డైరక్ట్ చేయటం జరిగింది. మిగతా భాగం అంతా తను బాగా తెరకెక్కించాడు.” అన్నాడు.

ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇదే తరహాలో మారుతి గతంలో నిర్మించిన “ప్రేమ కథా చిత్రం” సినిమా విషయంలోనూ ఇలాగే చేశాడు. సినిమా విడుదలయి ఇప్పటి లవర్స్ సినిమాలాగే మంచి పేరు తెచ్చుకున్నాక, లాభాలు తెచ్చిపెట్టాక, ఆ సినిమా మొత్తం తనే డైరెక్ట్ చేశానని చెప్పుకున్నాడు. ఆయన చెప్పిన విషయం నిజమా కాదా అన్నది ప్రక్కన పెడితే…ఆయన మాటల ప్రభావం ఖచ్చితంగా ఆ దర్శకుల కెరీర్ మీద పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వకుండా ఉంటే బాగుండేది అంటున్నారు.

మారుతి చేసిన కామెంట్స్ ఫలితమా, ” ప్రేమ కధా చిత్రం “దర్శకుడుకి ఇప్పటికీ ఇంకో సినిమా ప్రారంభం కాలేదు అన్న విషయం తెలిసిందే. మారుతీకే ఆ హిట్ క్రెడిట్ వెళ్ళిపోవటంతో ఆ దర్శకుడికి అదే మైనస్ గా మారిందనేది ఇండస్ట్రీ టాక్. ఇవన్నీ ఎలా ఉన్నా..మారుతి అనే బ్రాండ్ లేకపోతే ఈ చిత్రానికి ఇంత ఓపినింగ్స్ రావు…ఆ ఓపినింగ్స్ ని బేస్ చేసుకుని వచ్చిన కలెక్షన్స్ ఉండవు అనేది కూడా ఆలోంచిచాల్సిన నిజం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts