మనం' మా అమ్మకు బాగా నచ్చింది

0

Naga Chaithanya  (11)”నటనతో పాటు నాకు నిర్మాణం అంటే కూడా ఇష్టం. భవిష్యత్తులో నా సినిమాలకు ప్రొడక్షన్ డిజైనింగ్ నేనే చేసుకోవాలనుకుంటున్నా” అన్నారు నాగచైతన్య. తన తాత ఏయన్నార్, తండ్రి నాగార్జునతో కలిసి చైతన్య నటించిన ‘మనం’ చిత్రం ఇటీవల విడుదలై, విజయపథంలో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని కుటుంబం ఈ చిత్రాన్ని నిర్మించింది. ‘మనం’ విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో నాగచైతన్యతో జరిపిన ఇంటర్వ్వూ…

‘మనం’ చేయడం పట్ల మీ అనుభూతి?
‘మనం’ సినిమా భారీ వసూళ్లు రాబట్టాలనే ఆశయంతో చేసినది కాదు. ఏయన్నార్ గారి చివరి సినిమా కాబట్టి, అందరి గుండెల్లో ఈ సినిమా నిలిచిపోవాలనే ఆకాంక్షతో చేశాం. ఓ క్లాసిక్ లా నిలిచిపోవాలనుకున్న మా కోరిక నెరవేరింది. ఈ సినిమా విడుదలకు ముందు ప్రీమియర్ ఏర్పాటు చేస్తే, సినీ ప్రముఖులు పలువురు చూశారు. కేవలం చూడటం మాత్రమే కాదు..స్వచ్ఛందంగా ప్రమోట్ చేస్తున్నారు కూడా. ఈ సందర్భంగా వారికి, అక్కినేని అభిమానులకు, ఇతర ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా.

యూఎస్ లో నూ మంచి వసూళ్లు రాబడుతోందట కదా?
అవును. తాతగారి ఆశీర్వదాం వల్ల బిజినెస్ కూడా బాగుంది. యూఎస్ లో ఒక మిలియన్ డాలర్ టచ్ చేసిందని చెప్పారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు మన సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. కొత్త సినిమాలను తెలుగు ప్రేక్షకులు చూడరంటే నేను నమ్మను. కొత్త రకం సినిమా బాగుంటే ప్రేక్షకులు బాగా చూస్తున్నారు.

ఈ చిత్రదర్శకుడు విక్రమ్ గురించి?
‘ఇష్క్’ సినిమా ముందే ‘మనం’ కథ చెప్పాడు నాన్నకి. ఒక విజయవంతమైన సినిమా చేసుకుని వస్తే, తప్పకుందా అవకాశం ఇస్తా అన్నారు. ‘ఇష్క్’లాంటి విజయం అందించిన తర్వాత ‘మనం’ కథని ఇంకా డెవలప్ చేసి, మళ్లీ కలిశాడు. కథ విన్న వెంటనే తప్పకుండా ఈ సినిమా చేయాలని మేం అనుకున్నాం. తాతతో టైమ్ స్పెండ్ చేసే వీలు ఈ సినిమా ద్వారా దొరికింది. ఆ విధంగా ఈ సినిమా నాకో మంచి అనుభూతి మిగిల్చింది. ఆ అనుభూతులను పంచుకోలేను కానీ, నా జీవితాంతం నా గుండెల్లో ఉండిపోతాయ్. నటుడిగా నా ఎదుగుదలకు ఆ అనుభూతులు ఎప్పటికీ దోహదపడతాయి. రేపు వంద హిట్లు, ఫ్లాపులు వచ్చినా.. ‘మనం’ సినిమా ఎప్పటికీ నాకు ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఈ అవకాశం కలిగించిన విక్రమ్ కి ధన్యవాదాలు. అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు ఈ సినిమా బృందం మొత్తానికి ధన్యవాదాలు.

మీ నాన్నకు నాన్నలా నటించాలని విక్రమ్ చెప్పినప్పుడు ఏమనిపించింది?
మీరు నాగార్జునగారికి నాన్నలా చేయాలనగానే కొంచెం షాకింగ్ గా అనిపించింది. నీ స్టయిల్ లో ఈ కారెక్టర్ చెయ్యి అని విక్రమ్ అన్నాడు. దాంతో నాకు కంఫర్టబుల్ గా అనిపించింది. నా స్టయిల్ బయటకొచ్చింది. సినిమాలో తాత, నాన్నతో ఎక్కువ సీన్స్ లో సిల్లీగా బిహేవ్ చేస్తుంటా. సరిగ్గా చేయకపోతే చేయలేదనుకుంటారేమో.. అలాగని ఫ్రీగా చేసేస్తే ఇంత ఫ్రీగా చేసేస్తున్నాడేంటి? అనుకుంటారని భయం. అందుకని కొంచెం కష్టం అనిపించింది. తాత, నాన్న హెల్ప్ చేయడంవల్ల బాగా చేయగలిగాను.

మీ తాత, నాన్నలా కెమెరా ముందుకెళ్లగానే మీరు సీన్ లో లీనమైపోయేవారా?
నాన్నగారు అంతకుముందు తాతగారితో చేశారు కాబట్టి, స్ర్కీన్ పరంగా వాళ్లిద్దరికీ మంచి రాపో ఉంది. తాత, నాన్న ఎక్కువ సినిమాలు చేయడంవల్ల ‘వీడు నా కొడుకు కాదు.. నా మనవడు కాదు’ అని ఫిక్స్ అయిపోయి, కేరక్టర్ లో ఇన్ వాల్వ్ అవుతారు. కానీ, నేనిప్పటివరకు చేసింది ఎనిమిది సినిమాలే.అందుకని పక్కన తాత ఉన్నారు… నాన్న ఉన్నారు అనుకునేవాణ్ణి. సినిమా పూర్తయ్యే సమయానికి ఫ్రీ అయ్యాను. ‘మనం’ సినిమా చూసి, అమ్మ చాలా బాగా చేశావని మెచ్చుకుంది. నాన్నతో కలిసి నటించే అవకాశం ఎప్పడొచ్చినా నేను వదులుకోను.

నాగచైతన్చ, సమంత మేజిక్ మరోసారి వర్కవుట్ అయ్యిందని చాలామంది అంటున్నారు?
ఒక హీరో, హీరోయిన్ ఎక్కువ సినిమాలు చేస్తే.. సినిమా, సినిమాకీ కెమిస్ర్టీ పెరుగుతుంది. నేను, సమంత ఒకేసారి కెరీర్ ఆరంభించాం. మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది.

మీరు చేసిన తండ్రి పాత్ర రాధాకష్ణ నచ్చిందా? లేక స్టూడెంట్ కేరక్టర్ నాగార్జున నచ్చిందా?
స్టూడెంట్ కేరక్టరే నచ్చింది. ఎందుకంటే, అది ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంటుంది. ఇక, తండ్రి పాత్ర అంటారా.. అది చేయడానికి కష్టపడ్డాను. ఎందుకంటే, బిడ్డల పట్ల ఓ తండ్రి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. అందుకని కొంచెం కష్టపడ్డాను.

ఈ సినిమా కాన్సెప్ట్ పునర్జన్మల నేపథ్యంలో ఉంటుంది.. అసలు పునర్జన్మలను నమ్ముతారా?
మూడు తరాలంటే ప్రేక్షకులు ఎలా నమ్ముతారు? అని విక్రమ్ కథ చెప్పినప్పుడు అనిపించింది. కానీ, గత జన్మలో ఏవైనా కోరికలు మిగిలిపోయి ఉంటే, ఆ దేవుడు మళ్లీ పుట్టిస్తాడని అంటారు. నాకు పర్సనల్ గా ఇలాంటి తెలియవు కానీ.. జరిగే అవకాశం ఉందేమో అని మాత్రం అనిపిస్తోంది.

‘మనం’ సినిమాని ఒకే కుటుంబానికి చెందినవారు చేయడంవల్లే ఇంత క్రేజ్ వచ్చిందనుకుంటున్నారా? ఎవరు చేసినా ఇంతే ఆదరణ లభించి ఉండేదా?
ఒకే కుటుంబానికి చెందినవాళ్లం చేశాం కాబట్టే, ఎక్కువ క్రేజ్ వచ్చింది. తాత, నాన్న, నా కాంబినేషన్లో వచ్చిన సన్నివేశాలు చూడ్డానికి బాగుంటాయి. ఒకే కుటుంబానికి చెందిన మేం చేశాం కాబట్టే, కామెడీ కూడా వర్కవుట్ అయ్యింది.

ఈ సినిమా నటుడిగా మీకు మంచి అభినందనలు తెచ్చిపెట్టింది?
సినిమా సినిమాకీ నటుడిగా ఎదుగుతున్నాను. కెమెరా అంటే ఫియర్ పోతోంది. దాంతో ఫ్రీగా చేయగలుగుతున్నాను.

ఈ చిత్రంలోని పాటల్లో మీకు నచ్చినవి?
నాన్నగారి ఫ్లాష్ బాక్లో వచ్చే ‘చిన్ని చిన్ని ఆశ …’ పాట బాగా నచ్చింది. ఒక్క చిన్న బాధ ఏంటంటే.. ‘పియో.. పియో..’ పాటను తాతగారి మీద కూడా ప్లాన్ చేశాం. కానీ, ఆరోగ్యపరమైన కారణాల వల్ల తాతగారు చేయలేకపోయారు పాటల లిరిక్స్ అన్నీ బాగుంటాయి. సినిమాకి అవసరమైన ట్యూన్స్ ఇచ్చాడు. పాటలన్నీ కథతో కనెక్ట్ అయ్యాయి అని అందరూ అన్నారు. సెకండాఫ్ లో రీ-రికార్డింగ్ కూడా బాగుంటుంది. అనూప్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి.

ఈ సినిమా ఓ ప్రయోగం అనాలి. ఇది చేసిన తర్వాత సినిమా ఎంపిక చేసుకునే విషయాలపై మీ ఆలోచన ఏమైనా మారిందా?
ఖచ్చితంగా మారింది. రెగ్యులర్ ఫార్ములా సినిమాలు చేస్తేనే సేఫ్ అనుకుని ఇప్పటివరకూ సినిమాలు చేశాను. కానీ, ఫెయిల్యూర్ చవి చూశాను. వాస్తవానికి కొత్త కాన్సెప్ట్ చేయాలంటేనే నాకిష్టం. ఇకనుంచి అలాంటి సినిమాలు సెలక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను.

అఖిల్ ఇంట్రడక్షన్ ని ముందే ప్లాన్ చేశారా?
లేదు. చివరి నిమిషంలో అనుకున్నదే. తను కూడా ఉంటే బాగుంటుందని విక్రమ్ అన్నాడు. సోలో హీరోలకు కూడా అంత ఇంట్రడక్షన్ దొరకదు. అఖిల్ కి అంత మంచి ఇంట్రడక్షన్ అయ్యింది. భవిష్యత్తులో తను నాకు పోటీ అవ్వొచ్చు. పోటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఆరోగ్యకరమే.

‘ఆటోనగర్ సూర్య’ ఏమైంది?
ఆ సినిమా విడుదల నా చేతిలో లేదు. కానీ, ఎప్పుడొచ్చినా సూపర్ హిట్ అవుతుంది. ‘మనం’ తర్వాత నాకు క్లాసిక్ గా నిలిచిపోయే సినిమా అవుతుంది.

ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ‘ఒక లైలా కోసం’ చేస్తున్నా. టాకీ పూర్తయ్యింది. పాటల చిత్రీకరణ కోసం వచ్చే నెల విదేశాలు వెళుతున్నాం. జూలై లేక ఆగస్ట్ లో ఈ సినిమా విడుదలవుతుంది. ‘స్వామి రారా’ అంటే బాగా ఇష్టం. ఆ చిత్రదర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా. అది జూలైలో ఆరంభమవుతుంది. ఈ చిత్రాన్ని బి.వి.యన్.యస్.ప్రసాద్ నిర్మిస్తారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts