మంచు మనోజ్ సరసన.

0

Adah Sharma  (8)చిత్ర పరిశ్రమలో ఒక్క విజయం తారల జాతకాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. అప్పటి వరకూ అవకాశాల కోసం తపించిన వారిని ఒక్కసారిగా అందలమెక్కిస్తుంది. ఒక్క విజయంతో అదాశర్మ జీవితమే మారిపోయింది. హిందీ చిత్రసీమలో కథానాయికగా ఆరేళ్ల కెరీర్‌లో కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో హార్ట్ ఎటాక్ విజయంతో దక్షిణాదిన వరుస అవకాశాల్ని చేజిక్కించుకుంటోంది. ఇటీవలే కన్నడంలో పునీత్ రాజ్‌కుమార్‌తో ఓ చిత్రానికి ఓకే చెప్పిన ఆమె తెలుగులో మరో క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకుంది.

త్వరలో ఆమె మంచు మనోజ్‌తో జోడి కట్టబోతుంది. సాగర్ అనే నూతన దర్శకుడితో మంచు మనోజ్ ఓ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాలో అదాశర్మ కథానాయికగా ఎంపికైంది. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆమె పాత్ర ఆధునిక భావాలు కలిగిన అమ్మాయిగా, సంప్రదాయ యువతిగా రెండు భిన్న కోణాల్లో సాగనుందని సమాచారం. గ్లామర్, అభినయం రెండు కలబోసిన నాయికకు తమ చిత్రంలో చోటు కల్పించాలని భావించిన చిత్ర బృందం అదాశర్మను ఎంపికచేసినట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
'ఫ్రీ స్పోర్ట్స్ రిహాబ్ సెంటర్' కి మహేష్ బాబు చేయూత
6 సంవత్సరాలుగా స్లమ్ ప్రాంతాలలో రోజుకి 150 కి పైగా రోగులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎన్.జీ.ఓ కి మహేష్ బాబు తన సహాయ సహకారాలు అందిస్తున్నా...
powered by RelatedPosts