భారతీయ నటిపై పాకిస్తానీయుల దాడి

0

radhika apte

“రక్త చరిత్ర” సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితురాలైన నటి రాధికా ఆప్తే పై పాకిస్తానీయులు దాడి చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. అజ్మల్, రాధికా ఆప్తే జంటగా నటిస్తున్న చిత్రం వెట్రి సెల్వన్. ఎస్.నాగరాజన్, కె.సురేష్ బాబులు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రుద్రన్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర షూటింగ్ అనుభవాలను దర్శకుడు తెలుపుతూ మానసిక రుగ్మతలకు గురయ్యే వారి కష్టాలను ఆవిష్కరించే చిత్రం వెట్రి సెల్వన్ అని చెప్పారు. చిత్ర షూటింగ్ కాశ్మీర్‌లోని బెహర్‌గామ్, గాబామార్గ్, శ్రీనగర్ మొదలగు ప్రాంతాల్లో నిర్వహించినట్లు తెలిపారు.

బెహల్‌గామ్‌లో నటి రాధిక ఆప్తే సన్నివేసాలు చిత్రీకరిస్తుండగా ఆ ప్రాంతానికి చెందిన వారు షూటింగ్‌ను వ్యతిరేకించారన్నారు. భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ చేస్తున్నారేమిటి? అంటూ ఆగ్రహంతో యూనిట్‌పై దాడి చేశారని చెప్పారు. దిక్కుతోచని పరిస్థితిలో ఆ ప్రాంతంలోని సిక్కులు తమను రక్షించి కారులో సురక్షితంగా పంపించారని వివరించారు. తాము ఇండియా సరిహద్దులోనే షూటింగ్ చేశామని, అయినా అక్కడి వాళ్లు పాకిస్తానీయుల మాతో గొడవపడి దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఆ సంఘటన తలచుకుంటే ఇప్పుడు కూడా భయమేస్తోందని దర్శకుడు అన్నారు.

నదిలోకి దిగే ముందు లోతు చూసుకోవాలి అన్నట్టు, ఊరు కానీ ఊరిలో షూటింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సెక్యూరిటీ కూడా చూసుకోవాలి కదా….?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మార్చిలో భ‌ర‌త్ టీజ‌ర్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కొర‌టాల శివ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న విడుద‌ల‌కు ముహూర్తం కుదిర్చిన సంగ‌తి తెలిసిందే. ...
భార‌తీయుడు సీక్వెల్ లో సింగం
విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డంతో క‌మిట్ అయిన సినిమాలను త్వ‌రిగ‌తిన పూర్తిచేసే పనిలో పడ్డారు. ‘విశ్వరూపం 2’ సినిమా చివరి దశ పనుల...
హాట్ స‌మ్మ‌ర్ లో సెగ‌లు పెంచే సినిమాలు
2018 వేస‌విని మ‌రింత హీటెక్కించ‌డానికి టాలీవుడ్ స్టార్ హీరోలు రెడీ అయిపోతున్నారు. వ‌రుసుగా టాప్ స్టార్లంద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒకరి బ‌రిలోకి దిగిపోతు...
powered by RelatedPosts