భయపెటే ్టడాలర్స్ కాలనీ

0

Dollars Colony Movie Shooting Spot (19)ప్రిన్స్, నిఖితా పవార్ జంటగా నటిస్తున్న చిత్రం డాలర్స్ కాలనీ. ఎస్. రత్నమయ్య, టి.గణపతి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీచంద్ ముల్లా దర్శకుడు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ హారర్, కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రమిది. హాస్యానికి ప్రాధాన్యతనిస్తూ రూపొందుతున్న ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్విస్తూనే వుంటుంది. ప్రిన్స్ పాత్ర చిత్రణ కొత్త పంథాలో సాగుతుంది. అలీ, షాయాజీషిండే, ధన్‌రాజ్, హేమ కాంబినేషన్‌లో వచ్చే కామెడీ సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ప్రేమ, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ 90 శాతం చిత్రీకరణ పూర్తయింది.

బ్యాలెన్స్‌గా వున్న రెండు పాటల్ని త్వరలోనే పూర్తిచేస్తాం. ఆగష్టు నెలలో ఆడియోతో పాటు సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. రొమాంటిక్ హారర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం భయపెడుతూనే నవ్విస్తుందని కథానాయకుడు ప్రిన్స్ తెలిపారు. సరదాగా సాగిపోయే చిత్రమిదని అలీ పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిఖితా పవార్, ధన్‌రాజ్, హేమ, మల్లిక్, షాయాజీ షిండే తదితరులు పాల్గొన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts