బెంగళూరుడేస్ రీమేక్‌లో సమంతా?

0

Samantha2తెలుగు చిత్రసీమలో సమంతా జోరు కొనసాగుతోంది. టాలీవుడ్‌లో అగ్రకథానాయిక ఆమెనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో పలు భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుందామె. తాజా సమాచారం ప్రకారం సమంతా మరో చిత్రానికి అంగీకరించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే…మలయాళంలో విజయవంతమైన బెంగళూరుడేస్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంజలిమీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేరళలో సంచలనం సష్టిస్తోంది. విడుదలైన రెండువారాల్లోనే దాదాపు 25కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించి మలయాళ చిత్రసీమలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో దిల్‌రాజు, పీవీపీ సంస్థలు కలిసి తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో కథానాయికగా సమంతా ఖరారైనట్లు తెలిసింది. మలయాళ వెర్షన్‌లో నజ్రియా నజీమ్ పోషించిన పాత్రను సమంతా చేయనుందని సమాచారం. ప్రస్తుతం సమంతా తెలుగులో రభస అల్లుడు శీను చిత్రాలతో పాటు అల్లు అర్జున్ తాజా చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. తమిళంలో రెండు సినిమాల్ని చేస్తోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`అర్జున్ రెడ్డి` పోస్ట‌ర్ పై విరుచుకుప‌డ్డ వీ.హెచ్
విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి ట్రైల‌ర్స్ ఇప్ప‌టికే యూ ట్యూబ్ లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. డిఫ‌రెంట్ కంటెంట్ తో తెర...
ఎన్టీఆర్ స‌ర‌స‌న కిట్టుగాడి హీరోయిన్!
 కిట్టు గాడు చిత్రంతో లైమ్ లైట్ లోకి వ‌చ్చింది అనుఇమ్యాన్యూయేల్. తొలి సినిమా మ‌జ్ను ప‌ర్వాలేద‌నిపించినా అమ్మ‌డికి అంత‌గా గుర్తింపు రాలేదు. అయితే ...
 వీళ్లిద్ద‌రు హ్యాపీ...కానీ ఆయ‌న‌కు మాత్రం తిప్ప‌లే!
ర‌ణ‌వీర్ సింగ్-దీపికా ప‌దుకునే డీప్ ల‌వ్ లో ఉన్న సంగతి  తెలిసిందే. ముంభై లో ప‌గ‌లు రాత్రి తేడాలేకుండా తిరిగేస్తున్నారు. మీడియాకు అడ్డంగా దొరికిపో...
powered by RelatedPosts