బుర్ర వర్మది బలం నాది : మంచు విష్ణు

0

manchu-vishnuసంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏం చేసినా అదో పెద్ద న్యూస్ అయిపోతుంది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. సాంప్రదాయపు పద్దతులన్నిటికీ చరమగీతం పాడాలని కంకణం కట్టుకున్నాడో ఏమో కానీ, దర్శకత్వంలో పెను సంచలనాలకి తెరతీస్తున్న వర్మ కన్ను ఇపుడు సినిమా పంపిణీ మీద పడింది. మధ్యవర్తులు ఎవరూ లేకుండానే, ఇంటర్నెట్ వాడుతూ, సినీ వ్యాపారం మీద ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే తమ సినిమాను కొనుగోలు చేసేందుకు వీలుగా ‘ఫిల్మ్ ఆక్షన్ డాట్ ఇన్’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఆగస్టు 15న తమ కాంబినేషన్‌లో విడుదల కానున్న కొత్త సినిమా (టైటిల్ ప్రకటించలేదు)తో ఈ వినూత్న పద్ధతిని మొదలుపెడుతున్నట్లు మంగళవారం సాయంత్రం వర్మ, విష్ణు ప్రకటించారు.

‘‘ఆ సైట్‌లో ఫలానా హాలుకి మా సినిమా కొనాలంటే రేటు ఇంత అని నేరుగా పెట్టేస్తాం. ఎవరైనా ఆ రేటుకు, ఆ హాలు వరకు సినిమా కొనుక్కోవచ్చు’’ అని వర్మ ప్రకటించారు. ‘‘నియమ నిబంధనలన్నీ ఆగస్టు ఒకటి నుంచి సైట్‌లో ఉంటాయి. అంతా పారదర్శకమే. ఇప్పటి దాకా కొద్దిమందే డిస్ట్రిబ్యూటర్లున్నారు. ఈ వినూత్న విధానంతో వచ్చే కొత్తవాళ్ళతో కొన్ని వేలమంది తయారవుతారు’’ అని వర్మ అభిప్రాయపడ్డారు. హీరో విష్ణు మాట్లాడుతూ, ‘‘ఇప్పటి దాకా తెలుగునాట 300 హాళ్ళతో ఇలా సినిమాల కొనుగోలు, విడుదలకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఒకవేళ కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోతే, మా సినిమా మేమే విడుదల చేసుకుంటాం. ఇక్కడ బుద్ధిబలం వర్మది. భుజబలం నాది’’ అని చెప్పారు.

‘‘దేశంలోనే తొలిసారిగా ఈ రకమైన ఆలోచన చేస్తున్నాం. నలుగురు స్టూడెంట్లు కలిసి కూడా ఒక సినిమాను కొనుక్కొనేందుకు వీలు కల్పించే ఈ ప్రతిపాదన వల్ల సినిమాపై వ్యాపారం పెరుగుతుంది. ఇలా సినిమా పంపిణీ, కొనుగోలు వ్యవస్థను మొత్తాన్నీ సమూలంగా మార్చాలని భావిస్తున్నా’’ అని వర్మ వివరించారు. కేవలం తమ సినిమాకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో ఎవరైనా వేరే దర్శక, నిర్మాతలు తమను సంప్రతిస్తే, వారి చిత్రాలకూ తమ ‘ఫిల్మ్ ఆక్షన్ డాట్ ఇన్’ వెబ్‌సైట్ ద్వారా ఈ పద్ధతిలో సహకరిస్తామని వర్మ, విష్ణు ప్రకటించారు.

ఇలాంటి ఐడియా రావడం గ్రేట్ అని డిస్ట్రిబ్యూటర్లు సైతం అభినందించినట్లు వర్మ తెలిపారు. ‘ఐస్‌క్రీమ్’ చిత్ర నిర్మాణం విషయంలో తనపై వచ్చిన విమర్శల్ని వర్మ ప్రస్తావిస్తూ, ‘‘ఎవరేమన్నా నా పద్ధతి నాది. బొమ్మ కనబడుతోందా, సౌండ్ వినబడుతోందా అనేదే నా లెక్క. అంతేతప్ప, సినిమా ఎలా, ఏ కెమేరాతో తీశామన్నది ముఖ్యం కాదు. ఇక నుంచి టైటిల్స్‌లో కూడా టెక్నికల్ డెరైక్టర్, క్రియేటివ్ డెరైక్టర్ అనే రెండే పేర్లు వేయాలనుకుంటున్నా’’ అని మరో సంచలనాత్మక ప్రకటన చేశారు. సినీ వ్యాపారంలో నూతన విప్లవానికి శ్రీకారం చుడుతున్న వర్మ ఏ మేరకు విజయం సాధిస్తారో, ఎంతమంది దీన్ని స్వాగతిస్తారో వేచి చూడాలి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

తార‌క్ స‌ర‌స‌న పూజా హెగ్దే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న సినిమా త్వ‌ర‌లో సెట్స్ కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇందులో హీరోయిన్ ...
రాజ‌మండ్రిలో స‌మంత రైడింగ్
సమంత స్కూటీపై షికార్లు చేసేస్తోంది. ఎంజాయ్‌ చేయడం కోసం కాదు లేండి. ఆమె నటిస్తున్న చిత్రంలోని ఓ సన్నివేశం కోసం. సమంత కథానాయికగా ‘యూ టర్న్‌’ తె...
`సంత‌`తొలి షెడ్యూల్ పూర్తి
సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమక...
powered by RelatedPosts