బికినిలో ఆమెకి ఐశ్వర్య కూడా సరితూగదట

0


అబ్బో…నిజమా? ఐశ్వర్యనే మరిపించే ఆ అతిలోకసుందరి ఎవరబ్బా? అని అనుకుంటున్నారా? ఇదిగో… మీరే చదవండి.

బాలీవుడ్ లో ఈ రోజుల్లో బికిని వేసుకుని కనిపించడం పెద్ద విశేషమేమీ కాదు. ప్రస్తుతం ఉన్న పోటీని తట్తుకోవాలి అంటే, ఎదుటి మనిషి కంటే వీలైనంత ఎక్కువ అందాలనూ చూపించాల్సిందే అన్నట్టు అక్కడ పరిస్థితి ఉంది. విషయం ఏమిటి అంటే, ఇటీవలే విడుదలైన “బ్యాంగ్ బ్యాంగ్” చిత్ర ట్రైలర్స్ పట్ల సర్వత్రా పొగడ్తల వర్షం కురుస్తోంది. హృతిక్ రోషన్, కత్రీనా కైఫ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం “బ్యాంగ్ బ్యాంగ్” ట్రైలర్స్ ,కుర్రకారుకి కిర్రెక్కిస్తున్నాయి అంటున్నారు సినీ పండితులు. హృతిక్ కి పోటీగా కత్రీనా చేసిన కనువిందు, మరియు పోరాటాలు ప్రేక్షకులని సీట్లకి కట్టి పడేస్తాయి అని అందరూ అంకుంటున్నారు. “బ్యాంగ్ బ్యాంగ్” లో కత్రినా స్విమ్ సూట్‌లో పది నిమిషాలకు పైగా కనిపించడం మరో విశేషం.

అయితే, ‘ధూమ్’ సిరీస్‌లో ఐశ్వర్యా రాయ్, బిపాసా బసు కూడా స్విమ్ సూట్‌లో నటించిన విషయం తెలిసిందే. ఆ సన్నివేశాలను మరపించేలా ఇందులోని స్విమ్ సూట్ సీన్ ఉంటుందని బాలీవుడ్ టాక్. పైగా ఆ సన్నివేశంలో హృతిక్‌తో కలిసి కత్రినా ఘాటుగా నటించిందని విశ్వసనీయ సమాచారం.

అక్టోబర్ 2న హిందీతో పాటు తెలుగు, తమిళాల్లోనూ విడుదలయ్యే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాన్ని సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్స్ బాగున్నా యంటూ దర్శకుడు రాజమౌళి సైతం వ్యాఖ్యా నించారు. ప్రస్తుతం అభిమానులంతా “బ్యాంగ్ బ్యాంగ్” ఎపుడు విడుదల అవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
'ఫ్రీ స్పోర్ట్స్ రిహాబ్ సెంటర్' కి మహేష్ బాబు చేయూత
6 సంవత్సరాలుగా స్లమ్ ప్రాంతాలలో రోజుకి 150 కి పైగా రోగులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎన్.జీ.ఓ కి మహేష్ బాబు తన సహాయ సహకారాలు అందిస్తున్నా...
powered by RelatedPosts