బాహుబలికి రికార్డులు బలి

0

Bahubali working stills (7)భారతదేశ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోన్న రాజమౌళి సినిమా “బాహుబలి” షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల అవ్వొచ్చు అని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా, “బాహుబలి” కి సంబంధించిన బిజినెస్ ఆల్రెడీ జరిగిపోతోంది. కొన్ని ఏరియాల్‌లో అయితే ఏకంగా రికార్డు ధరలకి బయ్యర్లు ఎగబడి కొనుక్కుంటున్నారు అని తెలుస్తోంది.

ఇప్పటివరకు జరిగిన షూటింగ్ కి పెట్టిన ఖర్చు అక్షరాల 165 కోట్లు అని వినికిడి. ఐతే, ఇప్పటివరకు బిజేనెస్ చేసిన దాన్ని బట్టి నిర్మాతలకి వివిధ ప్రాంతాల పంపిణీ హక్కుల రూపంలో 79 కోట్లు ముట్టినట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా. తాజా సమాచారం ప్రకారం, ఏయే ఏరియాల్లో ఈ “బాహుబలి” ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసుకుందాం.

నైజామ్ – 25 కోట్లు
సీడెడ్ – 13 కోట్లు
కర్నాటక – 9 కోట్లు
వైజాగ్ – 7.5 కోట్లు
గుంటూరు – 6.5 కోట్లు
కృష్ణ – 5 కోట్లు
ఈస్ట్ గోదావరి – 5 కోట్లు
వెస్ట్ గోదావరి – 4.5 కోట్లు
నెల్లూరు – 3.5 కోట్లు
ఇవన్నీ కలిపితే మొత్తం 79 కోట్ల రూపాయలు.

ఇంకా తమిళనాడు, కేరళ, మహరాష్ట్ర తో పాటు ఓవర్సీస్ పంపిణీ హక్కులు కలిపితే ఈ చిత్రం 70 కోట్ల రూపాయల వరకు రాబడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం బహు భాషల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆ హక్కులు, శాటిలైట్ హక్కుల పరంగా కూడా ఈ చిత్రం భారీగా వసూళ్లు రాబడుతుందని ఊహించవచ్చు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts