బాలే కోసం రష్యాకు..!

0

Adah-Sharma-28-1024x1542నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆదాశర్మ. తొలి సినిమాతో ఫరవాలేదనిపించుకున్నా ఈ భామకు తెలుగులో ఈ సినిమా తరువాత సరైన అవకాశాలు దక్కలేదు. అయితే ఆదాశర్మ తాజాగా బాలీవుడ్‌లో ఓ ఆఫర్‌ని సొంతం చేసుకుందని తెలిసింది. బాలే డ్యాన్స్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందట. రష్యన్‌లకు ఈ డ్యాన్స్ అంటే మహాక్రేజ్. బాలే డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకోవడం కోసం ఆదాశర్మ త్వరలో రష్యా వెళుతోందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఆదాశర్మ మాట్లాడుతూ జిమ్నాస్టిక్స్‌లో ప్రావీణ్యం పొందిన నాకు బాలే నేర్చుకోవడం పెద్దగా కష్టతరమేమీ కాదు. సులువుగా నేర్చుకోగలను. ప్రత్యేక శిక్షణ తీసుకున్న అనంతరం చిత్ర షూటింగ్‌లో పాల్గొంటాను. ఈ సినిమాలో నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కొత్త లుక్‌తో కనిపిస్తాను అని తెలిపింది. 2008లో విక్రమ్‌భట్ రూపొందించిన థ్రిల్లర్ 1920 చిత్రం ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ ఈ ఏడేళ్లలో కేవలం ఐదు చిత్రాల్లో మాత్రమే నటించడం గమనార్హం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

వినాయ‌క చ‌వితికి జై కానుక ఇదే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ఇందులో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ...
ప్రియ‌మ‌ణి ఇంట్లో పెళ్ళి సంద‌డి
హీరోయిన్ ప్రియమణి వివాహం తన ప్రియుడు ముస్తఫారాజ్ తో ఈ నెల 25న వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రియమణి ఇంట్లో పెళ్లి సందడి నెల‌కోంది. మూడు రోజు...
స్పైడ‌ర్‌` ఓన్లీ రెండు భాష‌ల్లోనే?
స్పైడర్ తెలుగు వెర్షన్ విడుదలకు చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో తమిళ వెర్షన్ కూడా విడుదలవుతుంది. అయితే ముందు అనుకున్నట్లు హిందీ వెర...
powered by RelatedPosts