బట్టలిప్పడం అంటే నాకు చాలా భయం:

0

Samantha (7)ప్రస్తుతం టాలీవుడ్,కోలీవుడ్ లలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరయ్యా అంటే, ఇప్పటికిప్పుడు చేతిలో దాదాపు ఏడు సినిమాలతో బిజీబిజీగా ఉన్న సమంత పేరే చెబుతారు. ఆమె మొదటి నుండి కాస్త అదో టైప్ అంట. ఏ టైపో ఏమిటో మీరే చదవండి. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఆమె నటించిన ‘అల్లుడు శీను’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తనకు మంచి మాస్ ఇమేజ్‌ని తీసుకొచ్చిందని సమంత ఆనందం వెలిబుచ్చుతూ మీడియాతో ముచ్చటించారు.

‘అల్లుడు శీను’లో అందాలని కాస్త ఎక్కువగానే ఆరబోసినట్టున్నారు?
మీ మీడియా వాళ్ళ నాకు ఒక్కోసారి అస్సలు అర్ధం కావు. ఎందుకంటే, “ఏమాయ చేశావె”, “ఈగ”, “మనం” లాంటి పాత్రలు చేస్తే… సమంత ఇవి తప్ప మరొకటి చేయలేదు అని రాస్తారు. సరే కదా అని కాస్త భిన్నంగా కనిపిస్తే… సమంత మరీ ఇలా చేసేస్తుందా అని రాస్తారు. నిజానికి నాకు గ్లామర్‌గా కనిపించడం అంటే భయం. అందరూ ధైర్యం చెప్పి ఈ పాత్ర చేయించారు.

మీ కొలీగ్స్ తమన్నా, కాజల్, శ్రుతీహాసన్‌ల నుండి పోటీ తట్టుకోవడానికే ఇలా గ్లామర్ డోస్ పెంచారని టాక్ ఉంది…దీనిపై మీ స్పందన?
ఏదైనా ఒక రంగంలో పోటీ అనేది సహజంగానే ఉంటుంది. అందుకు గాను మన ప్రత్యర్ధూలని దగ్గరగా కనిపెట్టుకుని ఉండాలి. నాకు మొదట్నుంచీ నీట్ ఇమేజ్ ఉంది. ‘నీకు అలాంటి పాత్రలే సరిపోతాయి, గ్లామర్ పాత్రలు నీకు నప్పవు’ అని ఎవరైనా అన్నారనుకోండీ… నేను వాటి వైపే వెళ్తా. చేసి నా సత్తా నిరూపిస్తా.అసలే నాకు పట్టుదల చాలా ఎక్కువ.

బహుశా ఈ ప్రశ్న మీకు చిరాకు / కోపం తెప్పించవచ్చు…ఇంతకీ “అల్లుడు శీను” సినిమాకి మీకు భారీగానే సొమ్ములు చెల్లించారట కదా?
నేను కూడా ఈ విషయంలో చాలానే విన్నాను. ఈ సినిమాకు పారితోషికంగా నకేదో ఇల్లు రాసిచ్చారనీ, రెండు కోట్లు తీసుకున్నానని ఇలా చాలా రూమర్లు వచ్చాయి. నిజానికి కేవలం నిర్మాత బెల్లంకొండ సురేశ్‌గారి మీదున్న అభిమానంతో ఈ సినిమా చేశాను. భారీ పారితోషికం తీసుకున్న మాట పచ్చి ఆబధ్ధం. అయినా… ఇన్ని విజయాల తర్వాత కూడా నా పారితోషికం పెరగలేదు. దానికి కారణం ఏంటి? అనేది నాకు ఇప్పటికీ తెలీని విషయం. హీరోలకు పారితోషికాల కింద నిర్మాతలు ఏరియాలను రాసిచ్చేస్తుంటారు. కానీ… మా హీరోయిన్లకు ఎందుకు రాసివ్వరు? అందుకే మాక్కూడా ఓ ఏరియా రాసిస్తే బావుటుంది. ఏ ఏరియా తీసుకుంటే కరెక్టో మీరే చెప్పండి (సరదాగా)

మొదటిసారి మీరు నటించిన రెండు సినిమాలు ‘రభస’, ‘సికిందర్’ఒకే రోజు విడుదల అవుతున్నాయి. రెండింటి మీద మీ అంచనాలు ఏమిటి?
తమిళంలో నేను ఈపటివరకూ అన్నీ చిన్న చిన్న సినిమాలే చేస్తూ వచ్చాను. మొదటిసారి భారీ చిత్రం చేస్తున్నాను. అందుకే నా టెన్షన్ అంతా “సికిందర్” గురించే . కానీ ‘రభస’ విజయంలో నాకు టెన్షన్ లేదు. ఇప్పటిదాకా తమిళంలో నాకు సరైన విజయం లేదు. ఈ సినిమాతో అక్కడ కూడా నా ఫేట్ మారుతుందని ఆశిస్తున్నా.

ప్రస్తుతం హీరోయిన్లంతా స్త్రీ ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తున్నారు కదా, మీరెప్పుడూ అలాంటి ప్రయత్నాలు ఎందుకు చేయలేదు?
అలాంటి పాత్రలు అడిగి చేయించుకునేవీ కాదు. మనల్ని వెతుక్కుంటూ రావాలి. అందుకు కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. నేను మటుకు ప్రస్తుతం ఉన్న వాటిల్లో మంచి పాత్రలే చేస్తున్నాను. ఇప్పుడున్న హీరోయిన్లలో మెచ్చదగ్గ పాత్రలు దక్కింది నాకే అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే… ఇక నుంచి ప్రాధాన్యత, విలువలు, అభినయానికి ఆస్కారమున్న పాత్రలే చేయాలనుకుంటున్నాను. అందుకే.. చాలా సినిమాల్ని వదులుకున్నాను కూడా. ఇక నుంచి పాత్రల విషయంలో జాగ్రత్తగా వెళ్తాను.

సో… అదండీ విషయం. అమ్మడు ఇకపై మంచి పాత్రలే చేస్తుందట. నీకు ఫలానా పాత్ర సూట్ కాదు అంటే, నేను అదే చేస్తా అన్న సమంతకి ఎవరైనా “నీకు బికినీ సూట్ కాదు” అని చెబుతారేమో చూద్దాం…. !!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
powered by RelatedPosts