ఫిభ్రవరి 26న విడుదలవుతున్న ‘రాజుగారింట్లో 7వరోజు’

0

భరత్‌ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై అజయ్‌ ప్రధానపాత్రలో భరత్‌, అర్జున్‌, వెంకటేష్‌, అక్షయ్‌, సుష్మిత నటీనటులుగారూపొందిన చిత్రం’రాజుగారింట్లో7వ రోజు’. ఫిరోజ్‌ రాజ దర్శకత్వంలో భరత్‌కుమార్‌ పీలం ఈ చిత్రాన్నినిర్మించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిభ్రవరి 26న విడుదలవుతుంది.

దర్శకుడు ఫిరోజ్‌ రాజ మాట్లాడుతూ ”భరత్‌ ఈ సినిమాకు డబ్బే కాదుహార్డ్ వ‌ర్క్‌ తో చేశాడు. ‘హర్రర్‌, కామెడి, థ్రిల్లర్‌ సహా అన్నీ ఎలిమెంట్స్‌ ఉన్న చిత్రమిది.కనిష్క్‌ నాలుగు అద్భుతమైన సాంగ్స్‌ను, రీరికార్డింగ్‌ను అందించారు. ప్రతి ఒక్క‌రూ బాగా స‌పోర్ట్ చేశారు. సస్పెన్స్, హర్రర్, కామెడి సహా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం. టైట్ స్క్రీన్ ప్లేతో సాగుతుంది.సినిమాలో 30 నిమిషాల పాటు ఉండే గ్రాఫిక్స్ హైలైట్ గా నిలుస్తుంది. సినిమా ఫిభ్రవరి 26న విడుదల అవుతుంది. మా ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తారని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు.

హీరో,నిర్మాత భరత్‌ మాట్లాడుతూ ”కామెడి బేస్‌డ్‌ హర్రర్‌ థ్రిల్లర్‌ మూవీ. ఫిరోజ్‌ రాజ సినిమాను చక్కగా డైరెక్ట్‌ చేశారు. కనిష్క్‌ సంగీతం చాలా బావుంది. యూనిట్‌ అందరం కష్టపడి చేశాం. సినిమా బాగా వచ్చింది. శోభారాణిగారి చేస్తున సహాయం మరచిపోలేనిది. కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, పెయింటర్, ప్లంబర్ పని చేసే నలుగురు యువకులు ఏ పరిస్థితుల్లో జైలుకెళ్ళారు. ఈ కథకు వారికేం సంబంధం అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. దెయ్యాలుంటాయా? లేవా? అనే విషయాన్ని కూడా ఇందులో చెప్పాను. సపోర్ట్‌ చేసిన ఆర్టిస్ట్‌ లకు, టెక్నిషియన్స్‌ కు థాంక్స్‌. ఫిభ్రవరి 26న విడుదల చేస్తున్నాం. సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం” అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: క్రాంతి కె.కుమార్‌, మ్యూజిక్‌: కనిష్క్‌, నిర్మాత: భరత్‌కుమార్‌ పీలం, రచన, దర్శకత్వం: ఫిరోజ్‌ రాజ.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ఛ‌ల్ మోహ‌న్ రంగ` పాట‌లొచ్చేసాయ్!
ఉగాది అంటే ఇంట్లో పిండి వంటలు, బంధుమిత్రుల హడావిడి, థియేటర్లలో కొత్త సినిమాలే కాదు, యూట్యూబ్లో ఎన్నో సినిమాల పాటలు, టీజర్లు రిలీజ్ అవుతాయి. ఈ ఉగా...
నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో `నర్తనశాల` చిత్రం ప్రారంభం
`ఛలో` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఐరా క్రియేషన్స్ నాగశౌర్య హీరోగా నటించే రెండో చిత్రం @నర్తనశాల ప్రారంభమైంది. ఉగాది పర్వదినాన సినీ అతిరథు...
కలువ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ 
తెలుగు అంకెలు , తెలుగు మాసాలు తెలుగు భాషపై అవగాహన పెంపొందించే విధంగా కలువ క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమంన్యూస్ హెరాల్డ్ సంస్థ సౌజన్యం...
powered by RelatedPosts