ప్రేమ ప్రయాణంలో…

0

Gaali Patam Movie 1st Look Posters (5)దర్శకుడు సంపత్‌నంది చిత్ర నిర్మాణరంగంలోకి అడుగుపెడుతూ తన స్నేహితులతో కలిసి నిర్మిస్తున్న చిత్రం గాలిపటం. సంపత్‌నంది టీమ్ వర్క్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా నవీన్‌గాంధీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆది, ఎరికాఫెర్నాండెజ్, క్రిస్టినఅఖీవా, ప్రీతి రానా ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార గీతాన్ని ఇటీవలే విడుదల చేశారు.

పానీపూరి అనే పల్లవితో సాగే ఈ పాటను సంపత్‌నంది టీమ్ వర్క్స్ రచించగా భీమ్స్ సంగీతసారథ్యంలో శంకర్‌మహదేవన్, భీమ్స్ ఆలపించారు. భానుమాస్టర్ నత్య దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సంపత్‌నంది మాట్లాడుతూ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రమోషనల్ గీతంలో చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొన్నారు. నవతరం ప్రేమకథా చిత్రమిది. ప్రేమ ప్రయాణంలో ఓ యువజంట ఎదుర్కొన్న సంఘటనలు ఏమిటన్నదే ఈ చిత్ర ఇతివత్తం. రొటీన్‌కు భిన్నంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే చిత్రమిది అన్నారు. కార్తీక్, ప్రాచి, భరత్‌రెడ్డి, భార్గవి, పోసాని, సప్తగిరి, వేణు, చంద్ర, దువ్వాసి, శివన్నారాయణ, ప్రగతి, రేఖ, హేమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.బుజ్జి, ఆర్ట్: డి.వై.సత్యనారాయణ, ఎడిటర్: రాంబాబు, నిర్మాతలు: సంపత్‌నంది, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుత...
powered by RelatedPosts