ప్రేమ పయనంలో…

0

Nuvvala Nenila Movie New Stills (23)వరుణ్ సందేశ్, పూర్ణ జంటగా నటిస్తున్న చిత్రం నువ్వలా నేనిలా. అమోఘ్ క్రియేషన్స్ పతాకంపై ఇందూరి రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ రొటీన్‌కు భిన్నంగా వుండే ప్రేమకథా చిత్రమిది. విరుద్ధ మనస్తత్వాలు కలిగిన ఓ జంట ప్రేమ ప్రయాణంలో ఎదురైన సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతివత్తం. ప్రేమలోని గొప్పతనాన్ని తెలియజేప్పే ఈ చిత్రానికి కథానుగుణంగానే టైటిల్‌ను నిర్ణయించడం జరిగింది.

కుటుంబ విలువలతో పాటు వినోదానికి ప్రాధాన్యముంటుంది. వరుణ్‌సందేశ్, పూర్ణల రొమాన్స్ ఆకట్టుకుంటుంది. సాయికార్తీక్ బాణీలు, జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు. నిర్మాత మాట్లాడుతూ యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలున్న చిత్రమిది. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఈ నెలలోనే ఆడియోను, త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాంఅని తెలిపారు. సోనియా బిర్జి, వెన్నెల కిషోర్, ధన్‌రాజ్, ఉత్తేజ్, అరుణ్‌కుమార్, సన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: ఆమోఘ్ క్రియేషన్, సంగీతం: సాయికార్తీక్, ఎడిటర్: శ్రవణ్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts