‘ప్రేమమ్’

0

Nag chitanya

Premam

అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్, చందు మొండేటి ల కాంబినేషన్ లో ‘సితార సినిమా’ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం పేరు ‘ప్రేమమ్’.

అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ లు నాయకా,నాయికలు.
‘కార్తికేయ’ వంటి ఘన విజయం సాధించిన చిత్ర దర్శకుడు ‘చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘సితార సినిమా’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది.
ఈ చిత్రానికి ‘ ప్రేమమ్’ అనే పేరును నిర్ణయించామని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.
‘ప్రేమమ్’ తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..’అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్, చందు మొండేటి ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం. ఇప్పటివరకు 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ‘ ప్రేమమ్’ ను సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయనున్నామని తెలిపారు.
దర్శకుడు ‘చందు మొండేటి’ మాట్లాడుతూ .. ‘ ప్రేమమ్’ చిత్రానికి ఉప శీర్షిక (‘Love stories end… Feelings Don’t…) ‘ప్రేమ కధలకు ముగింపు ఉంటుంది కానీ.. అనుభూతులకు ఉండదు’ ….
కధానాయకుడు అక్కినేని నాగచైతన్య పాత్ర మూడు వైవిధ్యమైన కోణాల్లో కనిపిస్తుంది. ఆ మూడూ ఒకదానికొకటి పాత్రోచితంగా భిన్నంగా సాగుతూ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. ‘ ప్రేమమ్’ మూడు ప్రేమ కధల సమ్మిళితం. ప్రతి కధ ఎంతో నవ్యతను కలిగి ఉంటుంది. ఆ కధలకు ‘శ్రుతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్’ లు ఎంతగానో నప్పారు. ‘అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్’ ల జోడి ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. ‘ ప్రేమమ్’ ను తెలుగులో చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మన తెలుగు వాతావరణానికి తగినట్లుగా కధలో పలు మార్పులు చేసినట్లు దర్శకుడు ‘చందు మొండేటి’ తెలిపారు.
చిత్రంలోని ఇతర తారాగణం జీవా, బ్రహ్మాజీ, నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవింద్ కృష్ణ ,సత్య, కార్తీక్ ప్రసాద్, నోయల్, ఈశ్వర్ రావు,జోగి నాయుడు,కృష్ణంరాజు.
ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్, ; చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని: ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్; ఫైట్స్ : అనల్ అర్స్: ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్;
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం: చందు మొండేటి

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
powered by RelatedPosts