ప్రియుడి లోపాలని బయటపెట్టిన సుందరి

0

Deepika_padukone (9)ప్రేమించిన మనిషిలోని లోపాలని, గుట్టు చప్పుడు కాకుండా గుండెల్లో పెట్టుకోవాలి కానీ ఇలా బయటపెట్టుకుంటారా ఎవరైనా అని బాలీవుడ్ బక్క సుందరి దీపిక పడుకొనే తీరుని చూస్తున్న వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటో మీరే చదవండి మరి.

“రాంలీలా” సినిమాలో ముద్దుల ముచ్చట తీర్చుకున్న రనవీర్- దీపిక పడుకొనే జంట, సినిమా నిర్మాణ దశలోనే నిజంగానే ప్రేమలో పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీపిక స్వయంగా తన ప్రియుడి లోపాలను మీడియాకు వివరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజమైన ప్రేమంటే ప్రేమించిన వారి లోపాలను కూడా ఇష్టపడటం అని చేపుతోంది దీపిక. అందుకే రణ్‌వీర్‌సింగ్ కు కొన్ని విచిత్రమైన లోపాలు ఉన్నా తాను అవేమి పట్టించుకోను అని అంటోంది ఈ అందాలరాసి దీపిక. ఇక రణ్‌వీర్‌సింగ్ లోపాల గురించి చెపుతూ ఈ హీరో ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’తో బాధ పడుతున్నాడు అని చెపుతోంది దీపిక. ఈ వ్యాధి ఉన్నవారు ఊరకే భయపడటం, సౌకర్యంగా ఉండలేకపోవడం, చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం, అనవసరపు ఆత్రుత ప్రదర్శించడం లాంటి విషయాలు చేస్తూ ఉంటారట. ఈ వ్యాధి లక్షణాలు అన్నీ రణ్‌వీర్‌లో ఉన్నాయి అంటోంది దీపిక.

నీట్‌గా ఉన్న దాన్ని మళ్లీ మళ్లీ శుభ్రం చేసుకోవడం, మళ్లీ మళ్లీ చెకింగ్ చేసుకోవడం, తొందరపడిపోవడం, అతిగా ప్రేమించడం, శృంగారం విషయంలో అడ్వాన్స్ అయిపోవడం ఇవన్నీ ఆ వ్యాధి లక్షణాలే అని చెపుతూ లొకేషన్‌లో రణ్‌వీర్ ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది అని అంటోంది. షాట్ గ్యాప్‌లో పెర్‌ఫ్యూమ్ కొట్టుకోవడం నిమిషనిమిషానికీ దువ్వెనతో దువ్వుకోవడం చూయింగ్‌గమ్ విపరీతంగా నవలడం లాంటి లక్షణాలతో రణవీర్ చూసేవారికి విచిత్రంగా కనిపించినా తనకు మాత్రం అమాయకుడిలా కనిపిస్తూ చాల నచ్చుతాడని ముసిముసి నవ్వులు నవ్వుతూ దీపిక ఆ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ లో చెప్పడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ బాలీవుడ్ గా మారిపోయింది. అయితే ఈ విషయాలు అన్ని బహిరంగంగా ఎందుకు చెప్పిందో దీపికకే తెలియాలి .

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts