ప్రియుడితో జతగా…

0

ilianaఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో గోవాభామ ఇలియానా ప్రేమవ్యవహారం సాగిస్తోన్న విషయం తెలిసిందే. ముంబైలో జరిగిన అనేక సినిమా వేడుకల్లో వీరిద్దరూ కలిసి పాల్గొనేవారు. అయితే తన లవ్‌ఎఫైర్‌పై ఇప్పటివరకు మీడియా ముఖంగా స్పందించని ఇలియానా ప్రియుడితో కలిసి వెండితెరపై సందడి చేయబోతుంది. వివరాల్లోకి వెళితే…సైఫ్‌అలీఖాన్, గోవిందా కలిసి నటిస్తున్న హాస్యచిత్రం హ్యాపీ ఎండింగ్‌లో ఇలియానా కథానాయికగా నటిస్తోంది. తెలుగువారైన రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కె. ద్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశంలో ఇలియానా, ఆమె ప్రియుడు ఆండ్రూలు కలిసి నటించారని చిత్ర వర్గాలు వెల్లడించాయి. చిత్రీకరణ సమయంలో ఆండ్రూ తరచుగా సెట్స్‌కు విచ్చేసి ఇలియానాను కలిసేవాడట. యూనిట్‌సభ్యులతో అతను హుందాగా ప్రవర్తించిన విధానం, సినిమా పట్ల అతనికున్న పాషన్ నచ్చి సినిమాలో అవకాశమిచ్చామని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

నటనలో అనుభవం లేకపోయినా ప్రియురాలి సరసన వెండితెరపై కనిపించే భాగ్యం లభించడంతో అండ్రూ కూడా సంతోషంగా సినిమాకు ఒప్పుకున్నారని అంటున్నారు. ఇలియానా ఇచ్చిన సలహాలతో ఆండ్రూ చక్కటి నటనను కనబరిచాడని, దాంతో ఈ జంట ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయిందని యూనిట్ వర్గాలు తెలిపాయి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

వినాయ‌క చ‌వితికి జై కానుక ఇదే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ఇందులో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ...
ప్రియ‌మ‌ణి ఇంట్లో పెళ్ళి సంద‌డి
హీరోయిన్ ప్రియమణి వివాహం తన ప్రియుడు ముస్తఫారాజ్ తో ఈ నెల 25న వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రియమణి ఇంట్లో పెళ్లి సందడి నెల‌కోంది. మూడు రోజు...
స్పైడ‌ర్‌` ఓన్లీ రెండు భాష‌ల్లోనే?
స్పైడర్ తెలుగు వెర్షన్ విడుదలకు చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో తమిళ వెర్షన్ కూడా విడుదలవుతుంది. అయితే ముందు అనుకున్నట్లు హిందీ వెర...
powered by RelatedPosts