ప్రాధాన్యతలు మారాయి!

0

Kareena-Kapoor_20పెళ్లి తర్వాత నా ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం నేను సినిమాలకంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాను అని చెబుతోంది బాలీవుడ్ భామ కరీనాకపూర్. కథానాయకుడు సైఫ్ అలీఖాన్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ సుందరి ఈ మధ్యకాలంలో సినిమాల్ని బాగా తగ్గించింది. అదే సమయంలో కథాంశాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గత ఏడాది వచ్చిన గోరీ తేరే ప్యార్ మే చిత్రం ద్వారా ప్రేక్షకుల్ని పలకరించిందీ సుందరి. ఈ సినిమా తర్వాత చిత్రసీమకు దూరంగా వుంటూ కుటుంబసభ్యులతోనే ఎక్కువగా గడుపుతోంది. ఇటీవలే దిల్ దడ్కనే దో అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చినా తిరస్కరించింది. పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాధాన్యతలు మారుతాయి. పెళ్లి నాలో చాలా మార్పుల్ని తీసుకొచ్చింది. ఇప్పుడు జీవితాన్ని కొత్త వెలుగులతో దర్శిస్తున్నాను. ఇల్లే నా ప్రపంచం అయింది. కథానాయికగా చాలినంత ఖ్యాతిని సంపాదించాననుకుంటున్నాను.

ఇకముందు పూర్తిగా అభినయప్రధాన చిత్రాల్లోనే నటిస్తాను. కుటుంబంతో ఆనందంగా గడుపుదామనే ఉద్దేశ్యంతో భారీ సినిమా అవకాశాల్ని కూడా తిరస్కరించాను అని తెలిపింది. ప్రస్తుతం కరీనాకపూర్ సింగం రిటర్న్స్ గబ్బర్‌చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`అర్జున్ రెడ్డి` పోస్ట‌ర్ పై విరుచుకుప‌డ్డ వీ.హెచ్
విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి ట్రైల‌ర్స్ ఇప్ప‌టికే యూ ట్యూబ్ లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. డిఫ‌రెంట్ కంటెంట్ తో తెర...
ఎన్టీఆర్ స‌ర‌స‌న కిట్టుగాడి హీరోయిన్!
 కిట్టు గాడు చిత్రంతో లైమ్ లైట్ లోకి వ‌చ్చింది అనుఇమ్యాన్యూయేల్. తొలి సినిమా మ‌జ్ను ప‌ర్వాలేద‌నిపించినా అమ్మ‌డికి అంత‌గా గుర్తింపు రాలేదు. అయితే ...
 వీళ్లిద్ద‌రు హ్యాపీ...కానీ ఆయ‌న‌కు మాత్రం తిప్ప‌లే!
ర‌ణ‌వీర్ సింగ్-దీపికా ప‌దుకునే డీప్ ల‌వ్ లో ఉన్న సంగతి  తెలిసిందే. ముంభై లో ప‌గ‌లు రాత్రి తేడాలేకుండా తిరిగేస్తున్నారు. మీడియాకు అడ్డంగా దొరికిపో...
powered by RelatedPosts