ప్రయోగాలకే ప్రాధాన్యం

0

vidya-balanతనకు దక్షిణాది నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయని, అయితే కథాంశాలు నచ్చకపోవడంతో ఆ చిత్రాల్ని అంగీకరించలేదని చెప్పింది బాలీవుడ్ నటి విద్యాబాలన్. డర్టీపిక్చర్ కహానీ చిత్రాలతో జాతీయస్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న ఈ సుందరి మంచిస్క్రిప్ట్‌లు లభిస్తే భవిష్యత్తులో దక్షిణాది భాషా చిత్రాల్లో నటిస్తానని తెలిపింది. మహిళాప్రధాన కథాంశాలకే తాను ప్రాధాన్యతనిస్తానని దర్శకనిర్మాతలు అలాంటి కథలతో తన వద్దకు రావాలని సూచించింది. ఆమె మాట్లాడుతూ ఈ మధ్యనే తెలుగు, తమిళ భాషల్లో కొన్ని కథల్ని విన్నాను.

ఎందుకో ఆసక్తికరంగా అనిపించలేదు. మలయాళ, బెంగాలీ భాషల్లో కొన్ని స్క్రిప్ట్‌లు నచ్చాయి. అందుకే అక్కడి సినిమాలు చేద్దామనుకుంటున్నాను. పూర్తి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తే నిర్మాతలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంటుంది. అందుకే వాణిజ్యఅంశాలు మేళవించిన ప్రయోగాత్మక చిత్రాలకే నేను ప్రాధాన్యతనిస్తాను. ప్రస్తుతం బాలీవుడ్‌లో మహిళా నేపథ్య చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. క్వీన్ చిత్రం అగ్రహీరో చిత్రాలకు ధీటుగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది. నా దష్టిలో హీరోయిన్ ఇమేజ్ కంటే కథలో వైవిధ్యమే సినిమాకు విజయాన్ని చేకూరుస్తుంది అని తెలిపింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుత...
powered by RelatedPosts