ప్రయోగాలకు అతనొక్కడే!

0

kalyan-patasకల్యాణ్‌రామ్ పేరు వినగానే ప్రేక్షకులకు అతనొక్కడేచిత్రం గుర్తొస్తుంది. తన సొంత నిర్మాణ సంస్థపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా కల్యాణ్‌రామ్ కెరీర్‌ని మలుపుతిప్పి హీరోగా అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

లక్ష్మీ కల్యాణం నుంచి నిన్నటి ఓం 3డీ చిత్రాల వరకు విలక్షణమైన కథలతో చిత్రాలు చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న కల్యాణ్‌రామ్ పుట్టిన రోజు నేడు. ఆయన ప్రస్తుతం రెండు యాక్షన్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లో పటాస్ అనే పేరుతో తెరకెక్కుతున్న చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ కల్యాణ్‌రామ్ స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాతో పాటు కత్తి ఫేం మల్లిఖార్జున్ దర్శకత్వంలో రూపొందుతున్న షేర్‌లో నటిస్తున్నారు. కొమర వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

నిర్మాతగా రెండు భారీ చిత్రాలు..
రవితేజ కథానాయకుడిగా నటించిన కిక్ చిత్రానికి సీక్వెల్‌గా కిక్-2 నిర్మించడానికి కల్యాణ్‌రామ్ సన్నాహాలు చేస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాతో పాటు కల్యాణ్‌రామ్ తన సోదరుడు ఎన్టీఆర్ హీరోగా వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. స్క్రిప్ట్‌వర్క్ పూర్తయిన ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి రానుంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
powered by RelatedPosts