ప్రపంచ శృంగారనాయిక!

0

Deepika Padukone latest hot photos (4)ప్రఖ్యాత అంతర్జాతీయ మాసపత్రిక నిర్వహించిన ఓ పోల్‌లో ప్రపంచ శృంగార నాయిక (వరల్డ్స్ సెక్సీయెస్ట్ వుమెన్) టైటిల్‌ను కైవసం చేసుకుంది బెంగళూరు సుందరి దీపికాపదుకునే. వరుసగా మూడు పర్యాయాలు కత్రినాకైఫ్‌ను పేరిట వున్న ఈ టైటిల్‌ను ఈ ఏడాది దీపికా చేజిక్కించుకోవడం విశేషం. ఈ టైటిల్‌కు ఎంపికకావడం పట్ల దీపికాపదుకునే సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రజల ద్వారా ఎన్నుకోబడటం గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది. అయితే సెక్సీ అనే మాటను చాలా మంది సంకుచిత కోణంలో చూస్తున్నారని, తన దృష్టిలో ఆ మాటకు అర్థం వేరని ఆమె పేర్కొంది. సెక్సీ అనే మాటను శృంగార సంబంధమైనదిగానే చూస్తున్నారు.

శరీరసౌష్టవాన్ని వర్ణించటానికే ఆ మాటను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నా దష్టిలో సెక్సీ అంటే అందమైన వ్యక్తిత్వాన్ని కలిగివుండటం, హాస్యచతురతతో అందరినీ ఆకట్టుకోవడం, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని సాగించడం అని వివరించింది దీపికా. గత మూడేళ్లుగా తన సినిమా విజయాల ప్రాతిపదికనే ఈ టైటిల్‌కు ఎంపికశారని, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వ్యాపార ప్రకటనల్లో నటించడం కూడా ఈ గుర్తింపుకు కారణమైందని తెలిపింది. ప్రస్తుతం ఈ సుందరి బాలీవుడ్‌లో ఫైండింగ్ ఫెన్నీ అనే చిత్రంలో నటిస్తోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts