ప్రత్యేక గీతానికి సై!

0

Actress Nisha Agarwal Wedding Photos, Kajal Sister Nisha Agarwal Marriage Photosబాలీవుడ్‌లో అగ్రకథానాయికలు ప్రత్యేక గీతాల్లో నర్తించడం ఓ ట్రెండ్‌గా మారిన విషయం తెలిసిందే. దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా లాంటి పలువురు బాలీవుడ్ తారలు కథానాయికలుగా మెప్పిస్తూనే ఐటెంసాంగ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. కొంతకాలంగా వారి బాటలోనే అడుగులు వేస్తున్నారు తెలుగు కథానాయికలు. ఐటెంసాంగ్స్‌లో నటించడానికి ఆసక్తిని చూపుతున్నారు. శతిహాసన్, తమన్నా లాంటి అగ్రతారలు ఈ ప్రత్యేక గీతాల్లో ఆడిపాడబోతున్నారు. తాజాగా ఈ జాబితాలో మరో కొత్త భామ చేరింది. తెలుగులో అగ్రకథానాయికల్లో ఒకరిగా చెలామణీ అవుతున్న పంజాబీ భామ కాజల్ అగర్వాల్ తొలిసారి ఓ ప్రత్యేక గీతంతో కనువిందు చేయనుంది. వివరాల్లోకి వెళితే…అంజలి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం గీతాంజలి. రాజ్ కిరణ్ దర్శకత్వంలో వైవిధ్యమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతానికి చోటున్నట్లు సమాచారం. ఈ ఐటెంసాంగ్‌లో పేరున్న నాయికను తీసుకోవాలని భావించిన చిత్ర వర్గాలు చివరకు కాజల్ అగర్వాల్ వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. ఆమె కూడా ఈ పాటకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ప్రస్తుతం రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న గోవిందుడు అందరివాడేలే చిత్రంలో కథానాయికగా నటిస్తోంది కాజల్ అగర్వాల్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts