ప్రణీత వేడి తగ్గించిన సమంత

0

Samantha2సినీ పరిశ్రమలో ఎవరికేది రాసి పెట్టి ఉందో ఎవరికీ తెలియదు . ఎందుకంటే, ఇవాళ ఒక సినిమాలో ఫ్రెండ్ రోల్ పోషించిన నాటి రేపు వేరే సినిమాలో హీరోయిన్ అయిపోవచ్చు. ఈరోజు హీరోయిన్ గా చేసిన నటి, మరునాడే వేరే సినిమాలో గెస్ట్ రోల్ చేయొచ్చు. కాబట్టి, చాలామంది హీరోయిన్స్ మధ్య ఒక కోల్డ్ వార్ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా హీరోయిన్స్ మధ్య అనేది కోల్డ్ వార్ వెరీ కామన్. ఒక మూవీలో ప్రెండ్ క్యారెక్టర్ చేసిన హీరోయిన్, మరో మూవీలో మెయిన్ రోల్ చేస్తుంది. ఈ విధంగా ఏ హీరోయిన్ కూడ మరో హీరోయిన్ కింది స్థానంలో పనిచేయటానికి ఎక్కువుగా ఇష్టపడరు. ఆ విధంగానే ప్రస్తుతం టాలీవుడ్ లో ఇద్దరు హీరోయిన్స్ మధ్య కాంప్రమైజేషన్ తరహా కాంబినేషన్ నడుస్తుంది. అత్తారింట్లో సందడిచేసి..అందరిచూపులను తమవైపుకి తిప్పుకున్న సమంత, ప్రణీతలు, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కలిసి యాక్ట్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ రభసలో ఇదే కాంబినేషన్ రిపీట్ అవుతుండగా తాజాగా ఇప్పుడు బన్నితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

అల్లుఅర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వీరిద్దరి హీరోయిన్స్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మొదటగా ఈ మూవీలో ప్రణీతని మెయిన్ హీరోయిన్ గా తీసుకొని, కృతిసనన్ ని సెకండ్ హీరోయిన్ గా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తరువాత ఆలోచనలు మార్చుకొని, కృతిసనన్ మెయిన్, ప్రణీత సెకండ్ హీరోయిన్ అని ఫిక్స్ అయ్యారు. అయితే అందుకు ప్రణీత ఒప్పుకోలేదు. తను మెయిన్ హీరోయిన్ గా అయితే చేస్తానని చెప్పింది. తరువాత సీన్ కట్ చేస్తే కృతిసనన్ ప్లేస్ లో సమంత వచ్చింది. ఇప్పుడు సమంత మెయిన్ హీరోయిన్ అయింది. ఈ విషయంలో ప్రణీత అస్సలు ఒప్పుకోలేదు. సమంతతో తను సెకండ్ హీరోయిన్ గా చేసే అవకాశం లేదని తెగేసి చెప్పింది.

ఈ విషయంలో సమంత, ప్రణీతతో మాట్లాడి తనని ఒప్పించిందట. గతంలో వీరిద్దరూ అత్తారింటికి దారేది మూవీలో నటించారు. తరువాత ఇప్పుడు అల్లు అర్జున్,త్రివిక్రమ్ మూవీలో నటిస్తున్నారు. సమంత, ప్రణీతకి ఏం చెప్పిందో తెలియదు కాని ప్రణీత సెకండ్ హీరోయిన్ కి ఒప్పుకుంది. ఇక మూడో హీరోయిన్ గా వినిపిస్తున్న వార్తలపై అంతగా స్పష్టత లేకపోవడంతో, కృతిసనన్ దాదాపు లేనట్టే అని అంటున్నారు. ఇదిలా ఉంటే..అల్లు అర్జున్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా..ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోందంట.

కుదరదంటే కుదరదు అని ఒంటికాలు మీద అంతెత్తున లేచిన ప్రణీతని టెంపర్ ని, సమంత ఏ మాయచేసి తగ్గించిందో అని ఫిలిం నగర్ లో గుసగుసలాడుకుంటున్నారు .

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మెగాస్టార్ 151 `సైరా న‌ర‌సింహారెడ్డి` లో హేమాహేమీలు
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 151వ సినిమా `సైరా న‌ర‌సింహా రెడ్డి` చిత్రంలో హేమా హేమీలు భాగ‌మ‌య్యారు. బాలీవుడ్ లెజెండ‌రీ అమితాబ...
మెగాస్టార్ 151వ సినిమా `సైరా న‌ర‌సింహారెడ్డి` మోష‌న్ పోస్ట‌ర్ నా చేతుల మీదుగా లాంచ్ చేయ‌డం అదృష్టంగానూ..గౌర‌వంగాను భావిస్తున్నాను: ద‌ర్శ‌క ధీర‌డు రాజ‌మౌళి
మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చిరంజీవి 151వ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. మంగళవారం ఆయన పుట్టినరోజు స...
powered by RelatedPosts