పొల్లాచ్చిలో వాళ్ళ పని పూర్తైందట

0

Ram and  Rakul preet Singh Photos (4)ఎనర్జెటిక్ హీరో రామ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పండగ చేస్కో’. గత వారం పొల్లాచ్చిలో ప్రారంభమైన ఈ సినిమా తాజా షెడ్యూల్ నేటితో పూర్తయింది. హీరో హీరోయిన్లు, బ్రహ్మాజీ తదితర నటినటులు పాల్గొనగా కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. పల్లెటూరి సంప్రదాయాలు ప్రతిభింబించే సన్నివేశాలు చిత్రీకరించారు అని సమాచారం. ‘బలుపు’ లాంటి సూపర్‌హిట్ సినిమా తర్వాత గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం వల్ల , ఈమధ్య కాలంలో హిట్ లేని రామ్ “పండగ చేస్కో” మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ‘లెజెండ్’ ఫేం సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది. అమెరికా నుండి ఇండియా వచ్చిన ఎన్నారై యువకుడి పాత్రలో రామ్ నటిస్తున్నారు. అతని క్యారెక్టర్ చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారట. వెలిగొండ శ్రీనివాస్ కథ అందించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

తార‌క్ స‌ర‌స‌న పూజా హెగ్దే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న సినిమా త్వ‌ర‌లో సెట్స్ కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇందులో హీరోయిన్ ...
రాజ‌మండ్రిలో స‌మంత రైడింగ్
సమంత స్కూటీపై షికార్లు చేసేస్తోంది. ఎంజాయ్‌ చేయడం కోసం కాదు లేండి. ఆమె నటిస్తున్న చిత్రంలోని ఓ సన్నివేశం కోసం. సమంత కథానాయికగా ‘యూ టర్న్‌’ తె...
`సంత‌`తొలి షెడ్యూల్ పూర్తి
సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమక...
powered by RelatedPosts