పేరు మరిచిపోతే…!

0

Trisha-Latest-Photos-1547చెన్నై సొగసరి త్రిషకు వివాదాలు కొత్తేమీ కాదు. తాజాగా ఈ సుందరి మరో వివాదంలో చిక్కుకుంది. తమిళసంఘాలు ఇటీవల అమెరికాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొంది త్రిష. అక్కడ ఆమె చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారాన్ని లేపాయి. తమిళ పరిశ్రమలో తనకు అజిత్, శింబు, కమల్‌హాసన్‌లంటే చాలా ఇష్టమని త్రిష చెప్పడంతో తమిళ అగ్రహీరోల్లో ఒకరైన విజయ్ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు.

విజయ్ సరసన నటించిన గిల్లి (తెలుగు ఒక్కడు రీమేక్) చిత్రం ద్వారానే త్రిషకు తమిళంలో స్టార్‌డమ్ వచ్చిందని, అలాంటి హీరో ప్రస్తావన లేకుండా ఆమె మాట్లాడటం విశ్వాసఘాతుకమని విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో ఖంగుతిన్న త్రిష…విజయ్ అభిమానులకు క్షమాపణలు చెబుతూ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. తనకు అందరూ హీరోలు సమానమేనని, అనుకోకుండా విజయ్ పేరు చెప్పడం మరిచిపోయానని, అలా చేయడం తప్పేనని విచారం వ్యక్తం చేసింది. కొత్త హీరోయిన్ల తాకిడితో అవకాశాలు కరువైన త్రిషకు తాజా వివాదం తలనొప్పిగా మారిందని, ఇది ఆమె కెరీర్‌కు ప్రతిబంధకంగా మారుతుందేమోనని ఆమె సన్నిహితులు బాధపడుతున్నారట.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts