పీకల్లోతు ప్రెషర్ లో కొరటాల

0

Ganesh-Babu-Koratala-Shivaలేకలేక మొదటి సారి సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమాకి దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది అని మురిసిపోతున్న కొరటాల శివ మీద ఇప్పుడు ఎక్కడలేని ఒత్తిడి ఉంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్టు, ఎవరో తీసిన సినిమా ఫ్లాప్ కావడం, తన సినిమా మీద ప్రభావం చూపే స్థాయికి రావడం కొరటాల దురదృష్టం అనే చెప్పాలి.

సుకుమార్ తో “1-నేనొక్కడినే” ఫ్లాప్ కాగా, శ్రీను వైట్లతో చేసిన తాజా చిత్రం “ఆగడు” కాస్త ఆగేసరికి, కొరటాల శివ సినిమా మీద మహేష్ అభిమానులు ఇప్పుడు ఎక్కడలేని నమ్మకాన్ని పెట్టుకుంటారు. ఎన్నో అంచానాలతో ఎదురుచూస్తారు. ఎవరి అంచనాలకీ తగ్గకుండా సినిమాని రూపొందించడం ఇప్పుడు కొరటాల కి కత్తి మీద సామే అని చెప్పుకోవాలి. ప్రభాస్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు కురిపించిన “మిర్చి”లాంటి మసాలా హిట్ మహేష్ కి ఇస్తాడు అనే నమ్మకం కొరటాల మీద ప్రతి ఒక్కరికీ ఉంది. ఎంతవరకు నిజం అవుతాయో చూడాలి మరి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

తార‌క్ స‌ర‌స‌న పూజా హెగ్దే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న సినిమా త్వ‌ర‌లో సెట్స్ కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇందులో హీరోయిన్ ...
రాజ‌మండ్రిలో స‌మంత రైడింగ్
సమంత స్కూటీపై షికార్లు చేసేస్తోంది. ఎంజాయ్‌ చేయడం కోసం కాదు లేండి. ఆమె నటిస్తున్న చిత్రంలోని ఓ సన్నివేశం కోసం. సమంత కథానాయికగా ‘యూ టర్న్‌’ తె...
`సంత‌`తొలి షెడ్యూల్ పూర్తి
సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమక...
powered by RelatedPosts