పాప బుగ్గలపై గాట్లుపడ్డాయట పాపం…!!

0

bipashas-co-star-in-creature-is-a-brahmarakshas-movie-stills1-550x400_cఒక్కోసారి సినిమా కోసం ఎంతెంత కష్టపడాలో కదా అనిపిస్తుంది హీరో హీరోయిన్ల కష్టాలు చూస్తుంటే…!! కొందరు హీరోలైతే ప్రాణాలకి తెగించి మరీ రిస్కీ ఫైట్లు చేస్తుంటారు. హీరోయిన్లు కూడా ఆ మాటకొస్తే ఫైట్ సీక్వెన్స్ లలో ఈ మధ్య శక్తి వంచన లేకుండా కష్టపడిపోతున్నారు. వయసు మీద పడుతున్ననల్ల అందాల భామ బిపాషా కూడా తన తాజా సినిమా “క్రీయేచర్స్ 3డ్ ” సినిమా కోసం నానా ఫైట్లూ చేస్తోంది. ఇటీవలే బిపాషా పాల్గొనగా, దర్శకుడు విక్రమ్ భట్ కొన్ని ఫైట్ సీన్లు చిత్రీకరించాడు. ఊటీలో జరుగుతున్న “క్రీయాచర్స్ 3డ్” చిత్రం కోసం చేసిన ఈ షెడ్యూల్ లో బిపాషాకి కొన్ని మరచిపోలేని అనుభవాలు ఎదురయ్యాయి . ఫైట్లు చేసే సమయంలో బిప్స్ బేబీ బుగ్గలు రెండూ గీరుకుపోయాయట.

ఆ రోజు ఎలాగో షూటింగ్ ముగించుకుని ఇంటికి చేరుకుంది . ఆ మర్నాడు ఆమెకు సంబంధించిన క్లోజప్ షాట్స్ తీయాలనుకున్నారట విక్రమ్‌భట్. కానీ, ఆమె మందారం లాంటి బుగ్గలపై ఉన్న గాట్లు, కెమెరాలో స్పష్టంగా కనిపించడంతో మునుపటికన్నా మేకప్ డోస్ పెంచిందట బిపాసా. దాంతో ఒక్కసారిగా చర్మం మండిందట. ఈ విషయం గురించి బిపాసా చెబుతూ -‘‘ఫైట్స్ సీన్స్ చేయడానికి నేనెప్పుడూ వెనకాడలేదు. దెబ్బలు తగిలినా ఖాతరు చేయలేదు. సినిమా కోసం నా శరీరాన్ని ఏ స్థాయిలో అయినా కష్టపెట్టడానికి నేను రెడీ’’ అని చెప్పారు.

అవునులేమ్మా…. నీ శరీరాన్ని నువ్వెంత కష్టపేడితే ప్రేక్షకులకి అంత సుఖం మరి….!!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts