పాప బాగానే పాడుతుందట

0

actress_nithya_menon-wideఒకప్పుడు మన తెలుగులో అలనాటి మేటి నటి భానుమతి తన పాటలు తనే పాడుకునేవారు. ప్రస్తుతం తమిళంలో ఆ ట్రెండ్ కాస్త ఎక్కువ అయిందనే చెప్పుకోవచ్చు. పెద్దగా సంగీతంలో ప్రవేశం కూడా అక్కర్లేదు. వినసొంపుగా ఉండే గాత్రం అయితే చాలు, మైకు పట్టుకుని పాడేయొచ్చు. గాయనీమణులైన నటీమణుల శాతం తక్కువే. హీరోల్లో అయితే రజనీ, కమల్, విజయ్, సూర్య, శింబు, ధను ష్, కార్తి, విశాల్, శివకార్తికేయన్, భరత్ అంటూ వరుసపెట్టి పాడేశారు. ఇలా తమిళంలో పాడిన హీరోయిన్లు ప్రస్తుతం లేరనే చెప్పాలి. ఆండ్రియా, మమతా మోహన్ దాస్, రమ్యా నంబీశన్ వంటి వారు గాయనీమణులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే వీరందరూ ఇతర భాషలకు చెందిన వారేననన్నది గమనార్హం. వీరిలో రమ్యా నంబీశన్ కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు.

ఈమె మలయాళంలో పలు పాటలు పాడినా తొలిసారిగా పాండియనాడులో గళం విప్పారు. ఆ తరువాత డమాల్ డుమీల్ చిత్రంలో ఒక పాట పాడారు. ఇప్పుడీ జాబితాలో లక్ష్మీ మీనన్ చేరారు. కుంకీ నుంచి ఇటీవల విడుదలైన మంజాపై చిత్రం వరకు వరుస విజయాలనే తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్న ఈ లక్కీ హీరోయిన్ తాజాగా గాయని అవతారమెత్తారు. విమల్, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా కన్నన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక ఊరుల రెండు రాజా చిత్రం కోసం ఐటమ్ సాంగ్ పాడేశారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో ఈ పాటను లక్ష్మీ మీనన్‌తో పాడాల్సి రావడంపై దర్శకుడు కన్నన్ తెలుపుతూ ఈ పాటకు హస్నిగా ఉండే వాయిస్ అవసరం అయ్యిందన్నారు.

ఎవరితో పాడించాలన్న ఆలోచిస్తుండ గా డి.ఇమాన్ లక్ష్మీ మీనన్ పేరును సూచించారని చెప్పా రు. వెంటనే ఆమెను చెన్నైకి రప్పించి పాడించామని తెలి పారు. ఎక్కువ టేకులు తీసుకోకుండా రెండు గంటల్లో లక్ష్మీ మీనన్ పాడేశారని చెప్పారు. చాలా కాలం పాడాలనే ఆశ మనసులో ఉందని అది ఒరు ఊరుల రెండు రాజా చిత్రం ద్వారా నెరవేరడం సంతోషంగా ఉందని లక్ష్మీ మీనన్ పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన సంగీత దర్శకుడు డి.ఇమాన్, దర్శకుడు కన్నన్‌లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. డి.ఇమాన్‌కు హీరోయిన్లతో పాడించడం ఆనవాయితీగా మారింది. ఇంతకు ముందు ఆయన ప్రియాంక చోప్రా, మీనా, శృతిహాసన్, రమ్యా నంబీశన్ వంటి హీరోయిన్లతో పాడించారు.

ప్రస్తుతం తెలుగులో చేస్తున్న హీరోయిన్లలో నిత్య మీనన్ మాత్రమే అప్పుడప్పుడూ పాడుతోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
మార్చి 23న ప్ర‌పంచ వ్యాప్తంగా 'రాజరథం' 
నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్‌ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం 'రాజరథం'. అంజు వల్లభనేని, విషు...
మ‌ర‌క‌త శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవ‌స్థాన‌ము ద్వితీయ వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు
మ‌ర‌క‌త శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవ‌స్థాన‌ము ప్ర‌తిష్టించి రెండు సంవ‌త్స‌రాలు పూర్త‌యిన సంద‌ర్భంగా 02-04-2018 నుంచి 05-04-2018 వ‌ర‌కూద్వితీయ వార్ష...
powered by RelatedPosts