పాటల రికార్డింగ్ లో ‘డీల్ విత్ ధనలక్మి’

0
Danalakshmi 2 Danalakshmi 1
సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో శ్రీ గురు క్రియేషన్స్, విశ్వక్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘డీల్ విత్ ధనలక్ష్మి’. ఈ చిత్రం పాటల రికార్డింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నాయి. యువ కథానాయకుడు మానస్ హీరోగా వెంకట్ ప్రసాద్ (బాబీ) దర్శకత్వంలో  ఏవీయస్ శ్రీనివాస్, కవిత సింహచలం నిర్మిస్తున్న ఈ చిత్రానికి డా. జోశ్యభట్ల సంగీతదర్శకుడు. బాల భాస్కర్ రాసిన పాటను హేమచంద్ర పాడగా ఎస్.ఎ. మీడియా ల్యాబ్ లో రికార్డ్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ ప్రసాద్ (బాబి) మాట్లాడుతూ – ”ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. వినోద ప్రధానంగా సాగే చిత్రం. పది మంది కోసం పాటు పడే యువకుడి కథ ఇది. తాను అనుకున్న లక్ష్యాన్ని చేధించడానికి ఎంతదాకా అయినా వెళతాడతను. హ్యూమన్ రిలేషన్స్ కి వేల్యూ ఇచ్చే ఈ పాత్ర అందరికీ నచ్చే విధంగా ఉంటుంది” అని చెప్పారు.
నిర్మాతలు  ఏవీయస్ శ్రీనివాస్, కవిత సింహచలం మాట్లాడుతూ – ”ఈ నెల 10 నుంచి 30 వరకూ రాజమండ్రి, తాపేశ్వరం, సిద్దాంతం పరిసర ప్రాంతాల్లో ఒక షెడ్యూల్ జరుపుతాం. ఏప్రిల్ 7 నుంచి 25 వరకూ హైదరాబాద్ లో జరిపే రెండో షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుంది” అన్నారు.
మానస్ మాట్లాడుతూ – ”ఈ చిత్రకథ, స్ర్కీన్ ప్లే చాలా డిషరెంట్ గా ఉంటాయి. నా పాత్ర కూడా బాగుంటుంది” అన్నారు.
పూజిత, అంజలి, అర్చన, విజయభాస్కర్ రెడ్డి, సత్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ‘జబర్దస్త్’  కమెడియన్స్ తో పాటు చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జోశ్యభట్ల, కెమెరా: ఎ.వి. శ్రీనివాస్ (బాబు), పాటలు: బాల భాస్కర్, శ్రీరామ్ తపస్వి, బాబీ, నిర్మాతలు:  ఏవీయస్ శ్రీనివాస్, కవిత సింహచలం, కథ-మాటలు-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: వెంకట్ ప్రసాద్ (బాబీ).
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ఛ‌ల్ మోహ‌న్ రంగ` పాట‌లొచ్చేసాయ్!
ఉగాది అంటే ఇంట్లో పిండి వంటలు, బంధుమిత్రుల హడావిడి, థియేటర్లలో కొత్త సినిమాలే కాదు, యూట్యూబ్లో ఎన్నో సినిమాల పాటలు, టీజర్లు రిలీజ్ అవుతాయి. ఈ ఉగా...
నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో `నర్తనశాల` చిత్రం ప్రారంభం
`ఛలో` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఐరా క్రియేషన్స్ నాగశౌర్య హీరోగా నటించే రెండో చిత్రం @నర్తనశాల ప్రారంభమైంది. ఉగాది పర్వదినాన సినీ అతిరథు...
కలువ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ 
తెలుగు అంకెలు , తెలుగు మాసాలు తెలుగు భాషపై అవగాహన పెంపొందించే విధంగా కలువ క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమంన్యూస్ హెరాల్డ్ సంస్థ సౌజన్యం...
powered by RelatedPosts