పసందైన పెళ్లి భోజనం లాంటి సినిమా “దావత్ ఏ షాది”

0
1bb24704-aeba-47d1-ad2c-7b31a244dc3e 1 75eceb28-7028-41c9-b5ae-9e7d63a592cd 2 da637c45-4c51-4249-a892-bd3e047445d1 3
గత కొన్ని సంవత్సరాలుగా “హైదరాబాధీ  సినిమాలు” చేస్తున్న హల్ చల్ గురించి అందరికీ తెలిసిందే. సినిమా సినిమాకు అవి తమ పరిధిని విస్తృతం చేసుకుంటున్నాయి. అందుకు తాజా ఉదాహరణ “దావత్ ఎ షాది” అనే హైదరాబాధీ  చిత్రం. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తోంది. యాబా ప్రొడక్షన్స్ పతాకంపై సమి ఉల్లా ఫయాజ్-సయ్యద్ వసీం యాబా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సయ్యద్ హుస్సేన్ దర్శకత్వం వహిస్తున్నారు. అద్నాన్ సాజిద్ ఖాన్, మస్త్ అలీ, ఫిరోజ్ ఖాన్, మాధవి, మనీషా, కావ్య ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఈ నెల 4 (మార్చ్ 4) రాజశ్రీ ద్వారా విడుదలవుతోంది. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకొని హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు భారతదేశపు మొట్టమొదటి “డ్యుయల్ సిటిజన్ షిప్ కలిగిన వ్యక్తి”గా పేరొందిన ఇఫ్తేకార్ షరీఫ్ హాజరయ్యారు. 
ఇప్పటివరకు వరకు వచ్చిన హైదరాబాదీ సినిమాలను ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమె చూసేవారని.. కాని “దావత్ ఎ షాది” సినిమాను చూసేందుకు ఫ్యామిలీ  ఆడియన్స్ కూడా దియేటర్స్ కు తరలి వస్తారని, ఇదొక పసందైన పెళ్లి భోజనం లాంటి సినిమా అని దర్శకుడు సయ్యద్ హుస్సేన్ అన్నారు. 
తమ సినిమా “రాజశ్రీ” వంటి సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ ద్వారా రిలీజ్ అవుతుండడం చాలా గర్వంగా ఉందని నిర్మాతలు పేర్కొన్నారు. 
ఈ సినిమాలో నటించే అవకాశం లభించడం పట్ల మస్త్ అలీ, ఫిరోజ్ ఖాన్ తదితర నటులు సంతోషం వ్యక్తం చేసారు. 
ఈ చిత్రానికి ఎడిటింగ్: క్రాంతి, సినిమాటోగ్రఫి: వేలూరు మురళీకృష్ణ,  సంగీతం:ఎమ్.జి.కె.ప్రవీణ్, నిర్మాతలు: సమి ఉల్లా ఫయాజ్-సయ్యద్ వసీం యాబా , కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: సయ్యద్ హుస్సేన్!!  
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ద‌మ్ముంటే సొమ్మేరా`
 న‌టీన‌టులు: సంతానం, ఆంచ‌ల్ సింగ్‌, ఆనంద్‌రాజ్‌, క‌రుణాస్ త‌దిత‌రులు నిర్మాత : న‌ట‌రాజ్ బ్యాన‌ర్ : శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ సంగీతం :...
'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
powered by RelatedPosts