పవర్‌స్టార్ పనిచేయడం మొదలుపెడితే…

0

Pawan Kalyan Latest Trendy Look Photosఎలా ఉంటుంది అంటారా? ఇదిగో ఇలా ఉంటుంది. హీరో అనగానే పిలిచిన టైమ్ కి సెట్స్ కి వెళ్ళిపోయి పావుగంటకో షాట్ చేసి, పడక కుర్చీలో ఏ జ్యూసో తాగుతూ రిలాక్స్ అయ్యే హీరోలే కనిపిస్తారు మనకు కానీ, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ లాంటి హీరోలు కనిపించడం తక్కువ. ఎందుకంటే, పవన్ ఎక్కడ పడితే అక్కడే కూర్చుంటాడు…ఏది పెడితే అదే తింటాడు…ఎంతిస్తే అంతే తీసుకుంటాడు… ఎవరితో అయినా ఒకేలా ఉంటాడు. షూటింగులు లేకపోతే మిగతా హీరోల్లా పబ్బులు అంటూ పార్టీలు చేసుకోడు. షికార్లు చేయడు. తన ఫార్మ్ హౌస్ కి వెళ్ళి పొలం దున్నుకుంటాడు. మొక్కలకి నీళ్ళు పోస్తాడు. పుస్తకాల మీద పుస్తకాలు చదువుతాడు. అందుకే జనం పవన్ అంటే పడిచస్తారు. ఎవరెస్ట్ అంత ఎత్తున ఉన్నా, ఒక సామాన్య మానవుడిలా సింపుల్ గా పవన్ కల్యాణ్‌కి మాత్రమే సాధ్యం.

పవన్ కి చాలా విద్యలు తెలుసు. కొన్నిసార్లు తన సినిమాల్లో యాక్షన్ దృశ్యాలను తానే డిజైన్ చేసుకొంటాడు. ‘ఖుషి’తో కొరియోగ్రాఫర్ అవతారం ఎత్తాడు. ‘కాటమరాయుడా..’ అంటూ గొంతెత్తిన సందర్భాలున్నాయి. స్క్రీన్ ప్లే విద్యా తెలుసు. ‘జానీ’తో దర్శకుడూ అయ్యాడు. ఇప్పుడు ‘గబ్బర్ సింగ్ 2’ విషయంలోనూ తన ఆలోచనల్ని జోడిస్తున్నాడు. ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్‌కి రంగం సిద్ధమవుతోంది. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంపత్‌నంది దర్శకుడు. ‘గబ్బర్ సింగ్ 2’ స్క్రిప్టు విషయంలో పవన్ చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. కథ, స్క్రీన్ ప్లే విషయంలో ‘పెన్ను’ చేసుకొంటున్నాడు. ప్రస్తుతం ‘గోపాల గోపాల’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు పవన్.

ఈ మల్టీస్టారర్ పూర్తవ్వగానే ‘గబ్బర్ సింగ్ 2’కి కాల్షీట్లు కేటాయించనున్నాడు. అక్టోబర్ ద్వితీయార్థంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోగా.. పవన్ దగ్గరుండి స్క్రిప్టు పనులు చూసుకొంటున్నాడు. మరోవైపు కథానాయిక, సాంకేతిక నిపుణుల ఎంపికా జరుగుతోంది. పవన్ సరసన కథానాయిక ఎవరనే సంగతి ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts