"పవర్"స్టార్ పక్కన బికినీలో త్రిష?

0

trisha-pawanఅన్ని రోజులూ ఒకలా ఉండవు అన్నదానికి ,ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లని ఏలిన అందాల చెన్నై ముద్దుగుమ్మ త్రిష నిదర్శనం. ఆకర్షించే అందం, ఆకట్టుకునే అభినయాల మేళవింపుగా త్రిష ఒక దశలో ప్రతీ హీరోకి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది. కానీ, ఇప్పుడు త్రిషకి గడ్డుకాలం నడుస్తోంది. అరకొర అవకాశాలతో ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నట్టు అప్పుడో సినిమా ఇప్పుడో సినిమా చేస్తోంది. ఒకానొక దశలో బికినీకి కూడా సై అన్నా ఈ అమ్మడుని పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. కానీ, ఎట్టకేలకు ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం త్రిష తలుపు తట్టింది. అదేమిటో చూద్దాం.

తెలుగులో మహేష్ బాబు నటించిన ‘‘దూకుడు’’ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరకీ తెలిసిందే! ఈ సినిమాను కన్నడలో ‘‘పవర్’’గా రీమేక్ చేస్తున్న విషయం కూడా విదితమే! ఇందుకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ కన్నడ రీమేక్ లో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మహేష్ పాత్రను పోషించగా.. గ్లామర్ డాల్ సమంత పాత్రను త్రిష పోషించనుంది. అయితే ఆ మూవీ యూనిట్ సభ్యుల సమాచారం ప్రకారం… తెలుగులో సమంత అందించిన అందాల కంటే… కన్నడలో త్రిష మరింత ఎక్కువగా ప్రదర్శించిందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

బికినీ టాప్ మీద గాజుగుడ్డలను ధరించి, తన ఒంపుసొంపులను కన్నడ ప్రేక్షకులను కనువిందు చేయనుందని, దాదాపు తన శరీర అందాలను విపరీతంగా ప్రదర్శించిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. రాకరాక వచ్చిన అవకాశంతోనైనా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు త్రిష ఈవిధంగా అందాల ప్రదర్శన చేస్తోందని ఇండిస్ట్రీలో చెప్పుకుంటున్నారు.ఒకవేళ ఈ సినిమా కూడా దూకుడులాగా భారీ విజయాన్ని నమోదు చేసుకుంటే… త్రిషకు కన్నడలో వరుసగా అవకాశాలు వస్తాయని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

"సత్య గ్యాంగ్" సాంగ్స్ సూపర్ అంటున్నారు!!
సాత్విక్ ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాప...
స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
powered by RelatedPosts