పర్సు పోగొట్టుకుని పరేషాన్ అయింది పాపం

0

Rakul Preeth Singh (12)ఇంగ్లీష్ రివర్ ఈదిన మొనగాడు ఇంటి వెనకాల కాలువలో పడి కొట్టుకుపోయాడు అన్నట్టు, అడుగుకో దొంగ కనిపించే మన దేశంలోనే ఎంతో స్వేచ్ఛగా తిరిగిన అమ్మడు, పటిష్టమైన పోలీసీంగ్ వ్యవస్థ ఉన్న బ్యాంగ్ కాక్ లో హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకుని ఇబ్బందిపడింది. ఎవరా చిన్నది? ఏమా కథ?

స్నేహితురాళ్లతో కలిసి జాలీగా గడిపేందుకు బ్యాంకాక్ వెళ్లిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఫేం రకుల్ ప్రీత్ సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. మొబైల్ ఫోన్, ఐడీ కార్డ్, ఇతర వస్తువులు పోగొట్టుకుంది. ఇద్దరు ఆగంతకులు ఆమె లాక్కుపోయారు. రద్దీగా ఉండే రోడ్డులో స్నేహితులతో కలిసి వెళుతుండగా ఆమె బ్యాగును ఎత్తుకు పోయారు.

ఈ సంఘటన గురించి రకుల్ చెబుతూ… ‘రెండు రోజులు హాయిగా గడుపుదామని ఫ్రెండ్స్ తో కలిసి బ్యాంకాక్ వెళ్లా. మేము తుక్ తుక్ ప్రాంతంలో ఉండగా బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు నా బ్యాగు లాక్కుపోయారు. ఈ సమయంలో మేము ఏమీ చేయలేకపోయాం. తర్వాత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాం. నా బ్యాగు తిరిగి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు చెప్పారు. జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు’ అని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది.

ఆడపిల్ల అన్నాక, సోకులు – సొమ్ములు జాగ్రత్తగా పెట్టుకోవాలి కదమ్మాయ్….ఈ సారినుంచీ కాస్త జాగ్రత్తగా ఉండు మరి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts