పరిణీతి స్కూబా డైవింగ్

0

parineeti”స్కూబా డైవింగ్ అంటే మెడిటేషన్ లాంటిది. డైవింగ్ సమయంలో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటుంటారు. ఇప్పుడు నాకు ఆ ఆనందం తెలుస్తోంది. నీటిలో ఉంటూ సముద్ర గర్భాన్ని చూస్తే చాలా ఆనందమేసింది. జీవితంలో చూడలేను అనుకున్న అనేక దృశ్యాలను చూడగలిగాను” అంటూ తెగ సంబరపడిపోతోంది బాలీవుడ్ కథానాయిక పరిణీతి చోప్రా. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం డైవింగ్‌లో సర్టిఫికేట్ కోర్సులో శిక్షణ పొందుతోంది. ఇప్పటికే స్విమ్మింగ్ పూల్‌లో థియరీ తరగతులు పూర్తి చేసుకున్న పరిణీతి ఇప్పుడు ప్రాక్టికల్ శిక్షణలో ఉంది. ఇందులో భాగంగా నాలుగు మార్లు సముద్రంలో డైవింగ్ చేయాలి. ఇటీవల తొలి డైవింగ్‌ను పూర్తి చేసింది. ”సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ నా చిరకాల కోరిక స్కూబా డైవింగ్‌ను నెరవేర్చుకునే క్రమంలో చివరి దశకు వచ్చాను. మరో మూడు సార్లు డైవింగ్ చేస్తే అధికారిక ధ్రువపత్రాన్ని పొందుతాను” అంటూ చెప్పుకొచ్చింది పరిణీతి. ప్రస్తుతం ఈమె ‘దావత్ ఎ ఇష్క్’, ‘కిల్ దిల్’ సినిమాల్లో నటిస్తోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుత...
powered by RelatedPosts