పచ్చబొట్టు పాట్లు!

0

Nayan in Anamika movie  (10)ప్రేమ గుర్తులు జీవితాంతం వెంటాడుతూనే వుంటాయి. వాటిని వదిలించుకోవడం అంత ఈజీ కాదు. మలయాళీ సుందరి నయనతార విషయంలో ఇది నిజమనిపిస్తోంది. ప్రేమతో వేయించుకున్న పచ్చబొట్టు ఆమెకు కష్టాల్ని తెచ్చిపెడుతోంది. ప్రభుదేవాతో సుదీర్ఘకాలం ప్రేమాయణం సాగించిన ఈ సొగసరి ఆయన పేరుతో చేతిపై పచ్చబొట్టు వేయించుకున్న విషయం తెలిసిందే. ప్రేమ వ్యవహారం సాఫీగా సాగిన రోజుల్లో సదరు పచ్చబొట్టును అందరిముందు గర్వంగా ప్రదర్శించేది నయనతార. కాలక్రమంలో మనస్పర్థల వల్ల ఈ ప్రేమజంట దారులు వేరయ్యాయి.

గతాన్ని మరిచిపోయి వారిద్దరు సినిమాల్లో బిజీగా వున్నారు. అయితే చెరిగిపోలేని పచ్చబొట్టు వల్ల నయనతారకు అనుకోని చిక్కులు వచ్చిపడుతున్నాయి. ముఖ్యంగా మీడియా ముందుకు వచ్చినప్పుడు చేతిపై పచ్చబొట్టు కనిపించకుండా నయనతార పాట్లు పడాల్సివస్తోంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఫిల్మ్‌ఫేర్ వేడుకల్లో ఈ విషయం స్పష్టంగా బయటపడింది. ఈ కార్యక్రమానికి చీరకట్టులో వచ్చిన ఈ సుందరి చేతిపై వున్న పచ్చబొట్టు కెమెరాల కంటికి చిక్కకుండా వుండటానికి నానా తంటాలు పడింది. వేడుక ఆసాంతం చీరకొంగును పచ్చబొట్టుపై కప్పేసి వుంచిందట. ఈ విషయాన్ని మీడియా వారు గ్రహించే సరికి నయనతార అసౌకర్యానికి గురైందని తెలిసింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`అర్జున్ రెడ్డి` పోస్ట‌ర్ పై విరుచుకుప‌డ్డ వీ.హెచ్
విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి ట్రైల‌ర్స్ ఇప్ప‌టికే యూ ట్యూబ్ లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. డిఫ‌రెంట్ కంటెంట్ తో తెర...
ఎన్టీఆర్ స‌ర‌స‌న కిట్టుగాడి హీరోయిన్!
 కిట్టు గాడు చిత్రంతో లైమ్ లైట్ లోకి వ‌చ్చింది అనుఇమ్యాన్యూయేల్. తొలి సినిమా మ‌జ్ను ప‌ర్వాలేద‌నిపించినా అమ్మ‌డికి అంత‌గా గుర్తింపు రాలేదు. అయితే ...
 వీళ్లిద్ద‌రు హ్యాపీ...కానీ ఆయ‌న‌కు మాత్రం తిప్ప‌లే!
ర‌ణ‌వీర్ సింగ్-దీపికా ప‌దుకునే డీప్ ల‌వ్ లో ఉన్న సంగతి  తెలిసిందే. ముంభై లో ప‌గ‌లు రాత్రి తేడాలేకుండా తిరిగేస్తున్నారు. మీడియాకు అడ్డంగా దొరికిపో...
powered by RelatedPosts