నేను త్యాగిని కాను — ద్రోహిని కాను

0

vijayఎవరు ఈ మాటలు అన్నది అని ఆశ్చర్యపోతున్నారా? తమిళ హీరొ విజయ్ పైవిధంగా స్పందించాడు. ఎందుకు అంటారా? దానికో చిన్న స్టోరీ ఉంది..అదేంటో చదవండి. “కత్తి చిత్రంపై పలు తమిళ సంఘాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. శ్రీలంక తమిళులకు ఊచకోత కోసిన ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సేతో లైకా ప్రొడక్షన్ అధినేతలకు సన్నిహిత సంబంధాలున్నాయనేదే వారి వ్యతిరేకతకు ప్రధాన కారణం” . ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో “కత్తి” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ సినిమా ఆడియో వేడుక నిన్న సాయంత్రం చెన్నైలో ఘనంగా జరిగింది. “కత్తి” పై రేగుతున్న వివాదాలకి ముగింపు పలికేందుకు హీరో విజయ్ తన మనసులోని మాటల్ని ఇలా తెలిపాడు.

“నేను త్యాగిని కాను. అలాగని ద్రోహినీ కాదు. తమిళనాడుకు చెందిన వాడిని. ఒక తమిళ కళాకారుడిని మాత్రమే. నా చిత్రాల గురించి నేనెప్పుడూ గొప్పలు చెప్పుకొను. అయితే కత్తి చిత్రం మాత్రం నాకు చాలా ముఖ్యమైనదని గట్టిగా చెప్పగలను.ఏఆర్ మురుగదాస్ చిత్రంలో ఇంతకుముందు నటించిన తుపాకీ చిత్రం మంచి విజయం సాధించిందన్నారు. మళ్లీ ఆయన దర్శకత్వంలో నటించడం సంతోషకరమైన విషయంగా పేర్కొన్నారు. ఈ చిత్రంపై జరుగుతున్న ప్రచారం గురించి తెలిసిందేనన్నారు. తానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం చేయదలచుకున్నానన్నారు. తాము చిత్రం చేసేది వివాదాల కోసమో, ఇంకా దేని కోసమో కాదన్నారు.

ప్రజలను సంతోష పరచాలనే ఏకైక లక్ష్యంతోనే చిత్రాలు చేస్తున్నట్లు వెల్లడించారు. తాను త్యాగిని కాదని, అలాగే ద్రోహినీ కాదని, తాను తమిళ కళాకారుడినని విజయ్ వ్యాఖ్యానించారు. కత్తి చిత్రంలో సమంత పాత్రకు ప్రాముఖ్యం ఉంటుందని, ఆమె చాలా బాగా నటించారని అన్నారు. తమ మధ్య కెమిస్ట్రీ కూడా అందంగా ఉంటుందని, కత్తి చిత్రం దీపావళికి తెరపైకి రానుందని విజయ్ తెలిపారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఫిబ్రవరి 25న 'కణం` తొలి సింగిల్‌
నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎన్‌.వి.ఆర్‌. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కణం'. 'ఛలో' తర్వాత నా...
`కాలా` టీజ‌ర్ డేట్ ఫిక్స్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కాలా’ మూవీ టీజర్‌పై సస్పెన్స్ వీడింది. ఎప్పడు రిలీజ్ చేస్తారా..? అని ఎదురు చూసిన అభిమాలను ఆ చిత్ర యూనిట్ శుభవార్త తె...
మార్చి 9న విజయ్ మంత్రం వేస్తాడా?
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో యువతలో కథానాయకుడు విజయ్ దేవరకొండ సంపాందించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి చిత్రంతో వ...
powered by RelatedPosts