నేను ఎప్పుడూ అలా చేయను : కాజల్

0

Kajol_photosస్టేటస్ కి తగ్గట్టు మేనేజ్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి…ముఖ్యంగా సినీ తారలకి అని వేరే చెప్పక్కర్లేదు. బ్ర్యాండెడ్ బట్టలు… ఖరీదైన కార్లు, మంచి పర్ఫ్యూమ్స్, లేటెస్ట్ మొబైల్ ఫోన్లు మొదలగునవి అందులో కొన్ని. ముఖ్యంగా హీరోయిన్స్ ఇలాంటి విషయాల్లో ఏ మాత్రం తగ్గరు. మరి ముద్దుగుమ్మ కాజల్ డబ్బునిఅగర్వాల్ డబ్బు ఖర్చుపెట్టె విషయంలో ఎలా ఉంటుంది…ఏం చేస్తుంది అన్నది కాజల్ మాటల్లోనే విని తెలుసుకుందాం రండి.

“కొంతమంది డబ్బుని నీళ్లలా ఖర్చుపెడుతుంటారు . ముఖ్యంగా గాడ్జెట్స్ విషయంలో. మార్కెట్‌లో కొత్తగా ఏదైనా వస్తువు వస్తే ఆలోచించకుండా కొనేస్తుంటారు. నేనూ చాలామందిని చూశా. ఒకొక్కరి చేతిలో రెండు మూడు సెల్‌ఫోన్లుంటాయి. కొత్తగా ఓ మోడల్ వస్తే మార్చేస్తుంటారు. నేను అలా కాదు. కనీసం రెండేళ్లయినా వాడాల్సిందే. ఆ ఫోన్ పాడైతేనే మరో ఫోన్ కొంటా. ‘ఆర్య 2’ సినిమా మీకు గుర్తుందా? అందులో నేను చీటికీ మాటికీ సెల్‌ఫోన్‌లు బద్దలుకొట్టేస్తుంటా. నిజ జీవితంలో మాత్రం అలాంటి పొరపాటు చేయను. వస్తువును పగలకొట్టేంత కోపం నాకెప్పుడూ రాదు.. రానివ్వను. ఫోన్ విషయాల్లోనే కాదు.. అన్ని విషయాల్లోనూ ఇంతే జాగ్రత్తగా ఉంటా. మన అవసరానికి మించిన ఆధునికత ఎందుకు..?” అని చెప్పుకొచ్చింది.

అబ్బ .. అమ్మడికి ఎంత సింప్లిసిటీనో కదూ?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts