నేను అర్జంట్‌గా టాయిలెట్‌కి వెళ్లాలి

0

salam khanఇదేంటి! సల్మాన్‌ఖాన్ స్టిల్ పెట్టి ‘నేను అర్జంట్‌గా టాయిలెట్‌కి వెళ్లాలి’ అంటారేం టనుకుంటున్నారా! అయితే ముందు అర్జంట్‌గా ఇటీవలే విడుదలైన సల్మాన్ ‘కిక్’ ప్రచార చిత్రం చూడండి. ఎందుకో మీకే అర్థమవుతుంది. అసలు విషయం ఏంటంటే… ఈ ట్రైలర్‌లో సల్మాన్ చెప్పిన డైలాగ్ ఇది. సల్మాన్ ఈ డైలాగుని హిందీలో చెప్పారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అచ్చ తెలుగులో చెప్పారు. అవును.. నిజం. ‘నేను అర్జంట్‌గా టాయిలెట్‌కి వెళ్లాలి’ అంటూ చక్కగా తెలుగులో డైలాగ్ చెప్పారు.

కథ రీత్యా లాకప్‌లో ఉన్న సల్మాన్… పోలీసులతో చెప్పే డైలాగ్ ఇది. అసలు ఆ సన్నివేశంలో ఆయన తెలుగులో మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చింది? తెలుగు డైలాగ్ ఈ సినిమాలో ఇదొక్కటేనా? ఇంకా ఉంటాయా? అనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. ఇక ట్రైలర్ విషయానికొస్తే… దేశవ్యాప్తంగా ఉన్న సల్మాన్ అభిమానులు పండుగ చేసుకునేలా ఉంది. కేవలం రెండున్నర నిమిషాల ట్రైలర్‌లోనే ఊహకందని ఫీట్లు చేసేశాడు సల్మాన్. ఇక సినిమాలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సూపర్‌హీరో లుక్‌తో సల్మాన్ చేసిన విన్యాసాలు ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉన్నాయి.

రెండు చక్రాల సైకిల్ నుంచి గాల్లో ఎగిరే హెలికాప్టర్ వరకూ ప్రతి వాహనంతో ఆడుకున్నారు సల్మాన్. ఈ ప్రచారచిత్రంతో సినిమాపై అంచనాలు ఆకాశమంత ఎత్తుకు చేరాయనడం తప్పేం కాదు. హాలీవుడ్ స్థాయిలో ‘కిక్’ ఉండబోతోందనడానికి ఈ ట్రైలరే ఓ నిదర్శనం. తెలుగు సినిమాలపై విపరీతమైన అభిమానం కనబరిచే సల్మాన్… గతంలో ‘పోకిరి, రెఢీ, స్టాలిన్’ చిత్రాలను బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. రాబోతున్న ‘కిక్’ కూడా రవితేజ ‘కిక్’ సినిమాకు రీమేక్ కావడం గమనార్హం.పైగా ఈ ట్రైలర్‌లో ఆయన తెలుగులో మాట్లాడడం నిజంగా విశేషమే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts