నువ్వలా నేనిలా గీతావిష్కరణ

0

Poorna Latest Gallery (18)వరుణ్‌సందేశ్, పూర్ణ జంటగా నటిస్తున్న చిత్రం నువ్వలా నేనిలా. అమోఘ్ క్రియేషన్స్ పతాకంపై ఇందూరి రాజశేఖర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర గీతాలు బుధవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలిప్రతిని నిర్మాత దామోదరప్రసాద్ ఆవిష్కరించారు.

నవదీప్ స్వీకరించారు. ఈ సందర్భంగా వరుణ్‌సందేశ్ మాట్లాడుతూ త్రినాథరావు దర్శకత్వంలో నేను నటిస్తున్న రెండో చిత్రమిది. ఆయన మీదున్న నమ్మకంతో కథ వినకుండా ఈ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రం నాకు ఓ మంచి హిట్‌నిచ్చి నా కెరీర్‌ను మలుపుతిప్పుతుందనే నమ్మకముంది. సాయికార్తీక్ చక్కటి బాణీలనిచ్చారు. ఈ సినిమాలో పూర్ణ నటనను చూసి ఆమెకు పెద్ద అభిమానిగా మారిపోయాను అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ రొటీన్‌కు భిన్నంగా వుండే ప్రేమకథా చిత్రమిది. టైటిల్‌కు తగినట్లుగానే సినిమా ఆద్యంతం హృదయాన్ని హత్తుకునేలా సాగుతుంది అని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ సున్నితమైన భావోద్వేగాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అందంగా తీర్చిదిద్దారు. ఆగస్టు ప్రథమార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని పేర్కొన్నారు. వరుణ్‌సందేశ్‌తో కలిసి నటించడం ఆనందంగా వుందని కథానాయిక పూర్ణ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్, నిఖిల్, ప్రిన్స్, రాజ్‌తరుణ్, సాయికార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స్టార్ హీరోని టార్గెట్ చేసిన తేజ‌!
`నేనే రాజు నేనే మంత్రి` సినిమా స‌క్సెస్ తో తేజ మ‌ళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యాడు. డైరెక్ట‌ర్ గా ప‌ట్టాలు త‌ప్పి పోయినా బండిని ఒక్క హిట్ తో మ‌ళ్లీ ట్...
శ్ర‌ద్ధాకపూర్ ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది!
మ‌న స్టార్ హీరోల్లో మ‌గువ‌ల గుండెల్లో మారాజాగా వెలిగిపోతున్న డార్లింగ్ హీరో ఎవ‌రో చెప్ప‌గ‌ల‌రా?  .. లిప్త పాటు కాలంలో  ప్ర‌భాస్ అంటూ ఈజీగానే చె...
ధైర్యం` హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్
అలనాటి నటి మున్‌మున్‌ సేన్‌ కుమార్తె, బాలీవుడ్‌ నటి రియా సేన్‌ రహస్యంగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చింది.  కొంతకాలంగా రియా.. ఫొటోగ్రాఫర్‌ శివమ్‌ త...
powered by RelatedPosts