నీతులు చెప్పేందుకు బూతులెందుకన్న బ్యూటీ

0

Sonia Agarwal Latest Photos (19)అదృష్టం అనేది ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా వర్తిస్తుంది. కొందరికి అదృష్టం అనేది అందని ద్రాక్ష అయితే, మరికొందరికి వెంటే వచ్చే నీడలాంటిది. మరికొందరి విషయంలో మాత్రం ఒక్కసారి జీవితంలో పైకి తీసుకెళ్ళి “వదిలేసే” టైపు. ‘7/జి బృందావన కాలనీ’ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన అందాల భామ సోనియా అగర్వాల్ విషయంలో అదృష్టం ఆ మూడవ కోవకి చెందినదే అని చెపుకోవచ్చు. మొదటి సినిమాటోనే రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ ని చేసిన సోనియా అదృష్టం, ఆ తరువాత అక్కడ నుంచి నిర్దాక్షిణ్యంగా వదిలేసింది.
“7/8 బృందావన కాలనీ” తరువాత సోనియాకి మరే సినిమా కూడా అంతలా కలిసి రాలేదు. ఆ చిత్ర దర్శకుడు సెల్వారాఘవన్ తో పెళ్లి కాస్త పెటాకులయ్యింది. ఇప్పుడు కొంత విరామం తర్వాత సోనియా మళ్లీ తెలుగులో ‘నాకు కొంచెం టైమ్ కావాలి’ అనే చిత్రం అంగీకరించింది.

ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. సీతారామ ఫిలింస్ పతాకంపై వెంకటేశ్ రెబ్బ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భానూరు నాగరాజు (జడ్చర్ల) నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచాన్‌చేయగా, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి క్లాప్ ఇచ్చారు.

దర్శకుడు వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘రేపు గురించి మనకు ఈరోజే తెలిసిపోతే సంతోషంగా ఉండలేం… అందుకే భవిష్యత్తుని తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. నీతులు చెప్పడానికి బూతులు అవసరంలేదని చెబుతున్నాం’’ అన్నారు. మూడు షెడ్యూల్స్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తామని నాగరాజు చెప్పారు. కాలేజ్ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రం ఇదని సోనియా అగర్వాల్ తెలిపారు. నాగేంద్ర, వంశీ, ఫణిచంద్ర, పల్లవి, శ్రేష్ట హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts