నిజజీవితానికి దగ్గరగా వుంటుంది!

0

Shravya (33)చదువు, నటన నాకు రెండు ఇష్టమే. అందుకే బి.టెక్ చేస్తూనే సినిమాల్లో నటిస్తున్నాను. భవిష్యత్‌లో కూడా రెండింటికి ప్రాధాన్యతనిస్తూనే కథానాయికగా ప్రేక్షకుల్ని మెప్పించాలనుంది అని అన్నారు శ్రావ్య. లవ్ యు బంగారం చిత్రంతో కథానాయికగా తెలుగు తెరపై అడుగుపెట్టిన ఈ సుందరి జన్మదినం నేడు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో శ్రావ్య పాత్రికేయులతో ముచ్చటించింది. ఆమె మాట్లాడుతూ సినిమాల్లోకి వస్తానని నేను ఎప్పుడూ అనుకొలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆర్య చిత్రం ద్వారా బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశాను సందడే సందడి ఔనన్నా కాదన్న లాంటి చిత్రాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించిన నేను లవ్ యు బంగారం చిత్రంతో కథానాయికగా మారాను.

నా ఫొటోస్ చూసిన మారుతిగారు తన సినిమాలో అవకాశమిచ్చారు. నా పాత్రకు చక్కటి ప్రాధాన్యత వుండటంతో ఈ సినిమాలో నటించాల్సివచ్చింది. ప్రస్తుతం కాయ్ రాజా కాయ్ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నాను. ఇందులో నా నిజజీవితానికి దగ్గరగా వుండేలా చలాకీ అమ్మాయి పాత్రను పోషిస్తున్నాను. నా పాత్ర విలక్షణ రీతిలో సాగుతుంది. ఈ సినిమాతో పాటు శర్వానంద్ కథానాయకుడిగా కె.యస్.రామారావు నిర్మిస్తున్న చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాను. భవిష్యత్‌లో అవకాశం లభిస్తే బొమ్మరిల్లు చిత్రంలో జెనీలియాను పోలిన పాత్రను చేయాలనుంది అని తెలిపింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుత...
powered by RelatedPosts