నా ప్రేమ భిన్నంగా ఉంటుంది

0

Regina (2)తన ప్రేమ చాలా భిన్నంగా ఉంటుందని అంటోంది. ఈ బ్యూటీ కేడీ బిల్లా కిల్లాడి రంగా, అళగియ అసురా, పంచామృతం చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ భామ తన గురించి తెలుపుతూ ‘మా అమ్మది కర్ణాటక. నాన్న ఉత్తరాదికి చెందిన వారు. బామ్మ గోవాకు చెందిన ఆంగ్లో ఇండియన్. తాత క్రిస్టియన్‌గా మారిన బ్రాహ్మణుడు. నేను చెన్నైలో పుట్టాను. ఇక నేనే ఊరికో చెందిన అమ్మాయినన్నది తికమక పడే విషయం.

బాల నటిగా రంగ ప్రవేశం చేసిన నేను ముందుగా టీవీ సీరియళ్లలో నటించాను. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వం వహించిన ఆయుధ ఎళుత్తు చిత్రంలో సూర్య చిన్న చెల్లెలిగా నటించే అవకాశం వచ్చింది. కొన్ని కారణాలవల్ల ఆ చిత్రంలో నటించలేదు. ఆ తర్వాత తొమ్మిదవ తరగతి చదువుతుండగా కండనాళ్ ముదల్ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమయ్యాను. నాకు మాంసాహారం అంటే చాలా ఇష్టం.

ముఖ్యంగా చికెన్ ప్రియురాల్ని. ఒకసారి జంతు సంక్షేమ సంస్థ గురించి పుస్తకాన్ని చదివాను. అప్పటి నుంచి శాఖాహారిగా మారిపోయాను. ఇక నేను ప్రేమలో పడ్డట్టు ప్రచారం జోరందుకుంది. ఎవరో చెప్పింది వినకండి. కళ్లారా చూస్తేనే నమ్మండి. నా ప్రేమ అందరిలా సాధారణంగా ఉండదు. చాలా భిన్నంగా ప్రేమిస్తా. ప్రస్తుతానికి నా దృష్టంతా నటనపైనే’ అని పేర్కొంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

"సత్య గ్యాంగ్" సాంగ్స్ సూపర్ అంటున్నారు!!
సాత్విక్ ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాప...
స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
powered by RelatedPosts