నా దేవుడు నన్నొదిలిపోయాడు: దేవి

0

Devi SriPrasadపిన్న వ్యాసులోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచి ప్రముఖ మ్యాండోలిన్ విద్వాంసుడు “మ్యాండోలిన్” శ్రీనివాస్ గత కొద్ది రోజుల క్రితం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. వేలమంది శిష్యగణాన్నికలిగిన మ్యాండోలిన్ శ్రీనివాస్ కి, ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రియ శిష్యుడు అంటే ఆశ్చర్యపోతారు. చాలా హిట్ సినిమాల సంగీత దర్శకుడు అని పిలిపించుకోవడం కంటే ‘మాండలిన్ శ్రీనివాస్ శిష్యుడు ప్రసాద్’ అని పిలిపించుకోవడంలోనే నాకు కిక్ ఉంది. మాండలిన్ శ్రీనివాస్ శిష్యుడని గర్వంగా ఫీల్ అవుతాను అని యువ సంగీత తరంగం దేవి శ్రీ ప్రసాద్ అన్నారు. 9 ఏళ్ల వయసు నుండి సుమారు 10 సంవత్సరాల పాటు దేవి శ్రీ ప్రసాద్.. మాండలిన్ శ్రీనివాస్ గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. నన్ను ఒక శిష్యుడిలా కాకుండా సొంత తమ్ముడిలా చూసుకున్నారు. ఆయన మరణం ఒక పీడకల అయితే బాగుండేది అని దేవి శ్రీ ప్రసాద్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.

నేను ఎక్కువగా వెస్ట్రన్ మూడ్‌లో పాటలను కంపోజ్ చేసినా… మెలొడీని మాత్రం మిస్ చేయను. అది నా గురువుగారు పెట్టిన బిక్ష అని దేవి చెప్పారు. మాండలిన్ శ్రీనివాస్ అంటే మాండలిన్ వాయిద్యకారుడని చాలామంది భావిస్తారు. ప్రపంచంలో చాలా దేశాలు గురువు గారిని ‘ఆనరబుల్ సిటిజన్’గా గుర్తించాయి. ఆయన సాధించిన విజయాలు(ఎచీవ్‌మెంట్స్) అంతగా ప్రాచూర్యంలోకి రాలేదు. వాటిని వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఒక శిష్యుడిగా నాపై ఉంది. త్వరలోనే ఆ బాధ్యతను నిర్వర్తిస్తాను. అని దేవి శ్రీ తెలిపారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
`అ` తెచ్చిన అద్భుత అవ‌కాశం
`అ` హిట్ తో రెజీనా కు మంచి గుర్తింపు ద‌క్కింది. అందులో అమ్మ‌డి మేకోవ‌ర్ అంద‌ర్నీ విస్మ‌యానికి గురిచేసింది. స‌క్సెస్ అందుకుంది. అందుకే అ మ‌రో అద్భ...
powered by RelatedPosts