నా కోరికని ఆయన కాదనలేదు :ప్రియాంక

0

bollywood-priyanka-chopra-planes-premiereబాలీవుడ్ సెక్సీ గర్ల్ ప్రియాంక చోప్రా దర్శకుడు మధుర్ భండార్కర్ ని ఒక కోరిక కోరింది. ఇద్దరికీ ఎంతో చనువు ఉండటంతో, తాను అడిగితే మధుర్ కచ్చితంగా తన కోరికని తీరుస్తాడని ప్రియాంక అనుకుందట. ఇంతకీ అమ్మడు ఏం కోరింది? ఇది తెలియాలంటే చదవాల్సిందే మరి.

ఇంతకుముందు ఫ్యాషన్, పేజ్3 లాంటి సినిమాలతో నగరాల్లో విశృంఖలంగా సాగుతున్న సంస్కృతిని, అందులోని భిన్న పార్శ్వాలను ఎండగట్టిన బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ ఇప్పుడు మరో అస్త్రం బయటకు తీస్తున్నారు. ‘మేరీ కోమ్’ సినిమా విజయంతో దూసుకెళ్తున్న ప్రియాంకా చోప్రా తొలిసారిగా నిర్మాతగా మారి.. ‘మేడమ్ జీ’ అనే చిత్రం తీయబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్ర్రిప్టు, ఇతర వ్యవహారాలన్నింటినీ మధుర్ భండార్కర్ చూసుకుంటున్నారు.

సినిమాలో ఎవరెవరు నటిస్తారన్న విషయం ఇంకా తేలాల్సి ఉందని, అవన్నీ అయ్యేసరికి నవంబర్ అవుతుందని ప్రియాంకా చోప్రా చెబుతోంది. మేడమ్ జీ సినిమాలో ప్రియాంకా చోప్రా ఎటూ ప్రధానపాత్రలో నటిస్తుంది. మిగిలినవాళ్ల సంగతే తేలాలి. భండార్కర్ తీసిన ‘ఫ్యాషన్’ సినిమాలో కూడా ఆమె నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో నటనకు ఆమెకు జాతీయ ఉత్తమనటి అవార్డు కూడా వచ్చింది. తాను మొట్టమొదటిసారిగా తీసే సినిమాకు దర్శకత్వం వహించడానికి మధుర్ భండార్కర్ అంగీకరించినందుకు తానెంతో కృతజ్ఞురాలినై ఉంటానని ప్రియాంక చెబుతోంది.

అదండీ విషయం..!!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప్రశ్నిస్తా' సినిమా ప్రారంభం
జనం ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రముఖనిర్మాత సత్య రెడ్డి నిర్మిస్తున్న 'ప్రశ్నిస్తా' మూవీ కి తన కుమారుడైన మనీష్ బాబు ని హీరోగా పరిచయం చేస్తూ రాజా వన్...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
మార్చి 23న ప్ర‌పంచ వ్యాప్తంగా 'రాజరథం' 
నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్‌ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం 'రాజరథం'. అంజు వల్లభనేని, విషు...
powered by RelatedPosts